దిగి వస్తున్న టోకు ధరల సూచీ

14 Oct, 2016 13:28 IST|Sakshi

 న్యూఢిల్లీ: టోకు ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్లో  దిగి వచ్చింది.   వార్షిక  ధరల పెరుగుదల రేటు ప్రతిబింబించే  టోకు ధరల సూచీ 3.57 శాతం తగ్గింది. ఫుడ్ఆర్టికల్స్, కూరగాయల ధరలు  తగ్గుముఖం పట్టడంతో  ఇది స్వల్పంగా తగ్గుముఖంపట్టింది. 
టోకు ధరల సూచీ  గత ఆగస్టు నెలలో  రెండేళ్ల గరిష్టాన్ని తాకింది.   ఆగస్టులో 3.74 శాతంగా నమోదైంది. 2015 సెప్టెంబర్ లో  ఇది 4.59 శాతంగా నమోదైంది. 

వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ  విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రకారం  తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 64.97, ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం 4.76, ఇంధన ద్రవ్యోల్బణం 5.58 ఆహార ద్రవ్యోల్బణం 10.91 వద్ద సెప్టెంబర్ డబ్ల్యుపిఐ ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 5.75 శాతంగా  ఉంది.  ఆగస్టులో ఇది 8.23శాతంగా  నమోదైంది.   కాగా ఆర్బీఐ గవర్నర్  ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని    ద్రవ్య విధాన కమిటీ గతవారం 25 బేసిస్ పాయింట్లకు వడ్డీరేట్లలో కోత పెట్టిన సంగతి తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు