జీఎస్టీపై ఆ వార్తలు తప్పు

4 Jul, 2017 17:27 IST|Sakshi
జీఎస్టీపై ఆ వార్తలు తప్పు

వస్తు సేవల పన్ను(జీఎస్టీ)పై సోషల్‌మీడియాలో నకిలీ వార్తలు షేర్‌ అవుతున్నాయని ప్రెస్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ బ్యూరో పేర్కొంది. జీఎస్టీ చట్టంలో ఒక మతానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆలయ ట్రస్టులు జీఎస్టీ పన్ను చెల్లించాల్సివుంటుందని, ఇదే సమయంలో చర్చిలకు, మసీదులకు మాత్రం జీఎస్టీ నుంచి ఉపశమనం కల్పించారనే నకిలీ వార్తలు సోషల్‌మీడియాలో తిరుగుతున్నాయని చెప్పింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. ఇలాంటి వార్తలను షేర్‌ చేయొద్దని కోరింది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు