యాహూకి మరో షాక్!

24 Sep, 2016 12:07 IST|Sakshi
యాహూకి మరో షాక్!

కాలిఫోర్నియా:  భారీ  ఎత్తున  యాహూ ఖాతాలు  హాకింగ్ కు గురయ్యాయని ప్రకటించిన ఇంటర్నెట్   సంస్థ యాహూకి మరో షాక్ తగిలింది.  కనీసం 50 కోట్ల ఖాతాల హ్యాకింగ్  వ్యవహారంలో సంస్థ నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఒక యూజర్ కోర్టులో దావా వేశారు.  న్యూయార్క్ కు చెందిన   రోనాల్డ్ ష్వార్ట్జ్,  శాన్ జోస్, కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.  దీనిపై కఠినమైన చర్యలు  తీసుకోవడంతోపాటు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ వినియోగదారులను తరపున  కోర్టును ఆశ్రయించారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతను కాపాడతామని వాగ్దానం చేసిన సంస్థ  ఘోరమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని  స్క్వార్జ్ ఆరోపించారు..
అయితే ఈ వ్యాజ్యంపై స్పందించడానికి  యాహూ ప్రతినిధి సన్నీవేల్ తిరస్కరించారు.  వెరిజోన్, యాహూ వ్యాపార ఒప్పందానికి   నష్టం చేకూరే అవకాశం ఉందని, దీనికోసం సీఈవో మారిస్సా మేయర్స్  చేస్తున్నప్రయత్నాలను  ప్రభావితం చేస్తుందని చెప్పారు.
కాగా 50కోట్ల (500 మిలియన్) యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైనట్లు  యాహూ చీఫ్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ బాబ్ లార్డ్ ఈ విషయాన్ని గురువారం ధృవీకరించారు. దీనిని స్టేట్ స్పాన్సర్డ్ అటాక్‌ అని హ్యాకింగ్‌కు సంబంధించి విచారణ కొనసాగుతోందని ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు