యమహా బైక్స్ రీకాల్

17 Feb, 2017 11:56 IST|Sakshi
యమహా బైక్స్ రీకాల్
కార్ల కంపెనీలను సతమతం చేసిన రీకాల్ ప్రక్రియ, ఇప్పుడు బైక్ లకు చుట్టుకుంది. ఇంధన ట్యాంక్ బ్రాకెట్, మెయిన్ స్విచ్ సబ్ అసెంబ్లీలో లోపాలు కారణంగా యమహా ఇండియా తన పాపులర్ YZF-R3 బైక్ లను స్వచ్ఛదంగా రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 1,155 యూనిట్ల YZF-R3 బైక్ లను యమహా రీకాల్ చేయనుంది. కస్టమర్లకు సంతృప్తినిచ్చే బైక్ లను ఆఫర్ చేసే యమహా ఇండియా, కస్టమర్ల భద్రతే తన కమిట్ మెంట్ గా భావిస్తుందని కంపెనీ ఓ ప్రకటనను విడుదల చేసింది.
 
లోపాలను భాగాలను కొత్త వాటితో రీప్లేస్ చేస్తామని కంపెనీ తెలిపింది. యమహా డీలర్ షిప్ అన్నింటిలో వీటిని ఉచితంగా రీప్లేస్ చేయనున్నట్టు పేర్కొంది. రీప్లేస్మెంట్ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని, దీనికి సంబంధించి కంపెనీనే డైరెక్ట్గా కస్లమర్లను కాంట్రాక్టు చేయనున్నట్టు యమహా ఇండియా ప్రకటనలో స్పష్టంచేసింది. గతేడాది జూన్ లో కూడా యమహా 902 యూనిట్ల YZF-R3 బైక్ లను రీకాల్ చేసింది.  YZF-R3 మోటార్ సైకిల్ కొన్నింటిలో లోపాలు కారణంగా, కంపెనీ ఉత్పత్తిని తగ్గించింది.  
 
మరిన్ని వార్తలు