అదరగొట్టిన ఎస్ బ్యాంక్

20 Oct, 2016 13:53 IST|Sakshi

ప్రయివేట్‌ రంగ సంస్థ ఎస్ బ్యాంక్‌ అంచనాలను అధిగమించిన  ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది.   జూలై -సెప్టెంబర్ క్వార్టర్ లో 32 శాతం  వృద్ధితో  రూ. 802 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.   గత  ఏడాది రూ. 610   కోట్ల తో  పోలిస్తే మెరుగైన ఫలితాలో మరోసారి తన సత్తా చాటింది.  ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలనుగురువారం ప్రకటించినసంస్థ నికరవడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ. 1446 కోట్లను సాధించినట్టు తెలిపింది. ఈ ఫలితాలతో దలాల్ స్ట్రీట్ లో ఎస్ బ్యాంక్ షేర్ లాభాల్లో ఉంది. 

ప్రాఫిట్ గ్రోత్, లోన్  గ్రోత్, ఎస్సెట్  క్వాలిటీలో ఎస్ బ్యాంక్   అద్భుతమైన  ఫలితాలు సాధించిందని  మార్కెట్ విశ్లేషకుడు జి చొక్క లింగం వ్యాఖ్యానించారు. రుణాల వృద్ధి  కొనసాగితే బ్యాంక్  వాల్యూయేషన్ భవిష్యత్తులో మరింత పెరుగుతుందన్నారు.
ప్రొవిజన్లు రూ. 104 కోట్ల నుంచి రూ. 162 కోట్లకు  పెరిగగా ఇతర ఆదాయం రూ. 618 కోట్ల నుంచి రూ. 888 కోట్లకు జంప్‌చేసింది. స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏ)  జూన్ త్రైమాసికంలో 0.79 శాతంతో పోలిస్తే 0.83 శాతం నమోదు కాగా, నికర మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 0.29 శాతం వద్ద, , నికర వడ్డీ మార్జిన్లు'(ఎన్‌ఐఎం) 3.4 శాతం వద్ద స్థిరంగా ఉన్నట్లు బ్యాంక్‌ తెలిపింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి(సీఏఆర్‌) 15 శాతంగా నమోదైనట్లు పేర్కొంది.
 

మరిన్ని వార్తలు