'అలాంటోళ్లు పాకిస్థాన్ కు పోవాలి'

23 Jun, 2015 18:44 IST|Sakshi
'అలాంటోళ్లు పాకిస్థాన్ కు పోవాలి'

న్యూఢిల్లీ: విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వి ప్రాచీ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. యోగాను వ్యతిరేకించే వారంతా పాకిస్థాన్ కు వెళ్లాలని అన్నారు. యోగాను వ్యతిరేకించే వారికి ఈ దేశంలో ఉండే అర్హత లేదని ఆమె వ్యాఖ్యానించారు. యోగా చేయడాన్ని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు(ఏఐఎంఎపీఎల్బీ)  వ్యతిరేకించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీ పాల్గొనకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. ఆహ్వానం పంపడానికి ఇదేమి రాజకీయ నాయకుడి కుమార్తె వివాహం కాదని వ్యంగ్యంగా అన్నారు. సూర్య నమస్కారాలు వ్యతిరేకించే వారంతా సముద్రంలో దూకాలని అంతకుముందు బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు