'మరో పాకిస్తాన్ కాకుండా కాపాడారు'

3 Apr, 2017 14:29 IST|Sakshi

సంభాల్: ఉత్తరప్రదేశ్ ను మరో పాకిస్తాన్ కాకుండా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాపాడారని ఫైర్ బ్రాండ్ హిందూత్వ నాయకురాలు సాధ్వి ప్రాచి అన్నారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడం పట్ల యూపీ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఆయన పనితీరును ఆమె ప్రశంసించారు.

గత ప్రభుత్వం జరిగిన కుంభకోణాలపై విచారణ జరపాలన్న ప్రజల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుందని జోస్యం చెప్పారు. సమాజ్ వాదీ పార్టీ నాయకులకు ఇక నిద్ర కరువవుతుందని ఎద్దేవా చేశారు. యూపీలో మద్యపాన నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

మరిన్ని వార్తలు