న్యూజెర్సీ అసెంబ్లీకి భారతీయ అమెరికన్

7 Nov, 2013 20:47 IST|Sakshi
న్యూజెర్సీ అసెంబ్లీకి భారతీయ అమెరికన్

న్యూయార్క్: న్యూజెర్సీ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ అమెరికన్ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. డెమొక్రటిక్ పార్టీ ప్రతిపాదించిన 29 ఏళ్ల రాజ్ ముఖర్జీ చిన్న వయసులోనే అసెంబ్లీకి ఎన్నికైనవారిలో ఒకడిగా నిలిచిపోనున్నారు. రాజ్‌ముఖర్జీ గతంలో న్యూజెర్సీ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం జెర్సీ డిప్యూటీ మేయర్‌గా పనిచేశారు. మొదటి సారిగా డెమొక్రటిక్ పార్టీ ముఖర్జీని 33వ లెజిస్లేటివ్ జిల్లాకు ప్రతిపాదించింది. జూన్‌లో జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో ఆయన 36 పాయింట్ల తేడాతో విజయం సాధించారు. ముఖర్జీకి 18,586 ఓట్లు సాధించారు.

 

స్కూల్లో ఉన్నప్పుడే ఇంటర్నెట్ కన్సల్టెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కంపెనీని స్థాపించి ముఖర్జీ తన సత్తా చూపారు. దాన్ని తర్వాత పెద్ద టెక్నాలజీ కంపెనీకి విక్రయించారు. సెప్టెంబర్ 11 దాడుల తర్వాత యూఎస్ మెరైన్స్‌లో 17 ఏళ్లకే చేరిపోయారు. 19ఏళ్ల వయసులో ప్రజావ్యవహారాల కంపెనీని స్థాపించారు. దాన్ని న్యూజెర్సీలో మూడవ అతిపెద్ద న్యాయవాదుల లాబీయింగ్ కంపెనీగా తీర్చిదిద్దారు. పలు సంస్కరణల కోసం పనిచేశారు.

మరిన్ని వార్తలు