చెల్లీ ఇక నీకేం కాదు...

25 Sep, 2015 21:22 IST|Sakshi

చెల్లీ ఇక నీకేం కాదు... అన్నట్టు కనిపిస్తున్న ఆ ఫోటో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది. తన గర్భంలోని ముగ్గురు కవలలనూ కాపాడుకునేందుకు ఆ తల్లి చేసిన సాహసాన్ని వైద్యులూ సవాల్ గా తీసుకున్నారు. ఇద్దరు మగ శిశువుల ప్రాణాలకు  రిస్క్ అని తెలిసినా పాపను రక్షించుకునేందుకు..ఆ తల్లి   నెలలు నిండకుండా ముందుగానే ప్రసవం చేయించుకున్న తీరు... అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఇంట్లో ముగ్గురు పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేస్తోంది.


ఆస్ట్రేలియాకి చెందిన 22 ఏళ్ళ దన్ స్తాన్ అనే మహిళ ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చింది. నడి గర్భిణిగా ఉండగానే ఆమె ప్రసవానికి సిద్ధమైంది. మరో మార్గం లేని సందర్భంలో ఆమె... 28 వారాల్లోనే ప్రసవం చేయించుకుంది. ఇద్దరు మగ శిశువులతోపాటు... కడుపులో ఆక్సిజన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న పాపను కూడ రక్షించుకునేందుకు ఆమె భర్త రోహాన్ తో సంప్రదించి ధైర్యం చేసింది.  ఆస్పత్రిలో ప్రసవం అనంతరం కాస్త అనారోగ్యంగా ఉన్న బిడ్డలను పదకొండు వారాలపాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు.  అనంతరం ఆ దంపతులు ముగ్గురు బిడ్డలనూ ఆనందంగా ఇంటికి తీసుకెళ్ళారు.

మరిన్ని వార్తలు