పనిమనిషిపై అత్యాచారం: యువకుడికి ఏడేళ్ల జైలుశిక్ష

16 Oct, 2013 16:42 IST|Sakshi

తాను పనిచేస్తున్న ఇంట్లోనే పనిమనిషిపై అత్యాచారం చేసినందుకు ఓ యువకుడికి ఢిల్లీ కోర్టు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. బీహార్లోని మధుబని ప్రాంతానికి చెందిన ప్రమోద్ అనే ఆ యువకుడికి కోర్టు 3 వేల రూపాయల జరిమానా కూడా వేసింది. ప్రమోద్ ఢిల్లీలోని ఓ ఇంట్లో పనిచేస్తున్నాడు. అదే ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న మహిళపై 2010 అక్టోబర్ నెలలో అత్యాచారం చేశాడు.

అతడి నేరం నీచాతి నీచమని అదనపు సెషన్స్ జడ్జి కావేరీ బవేజా వ్యాఖ్యానించారు. అనంతరం అతడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అయితే, ప్రమోద్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బాధితురాలికి అతడు తగినంత నష్టపరిహారం చెల్లించలేడు కాబట్టి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోని అంశాల ప్రకారం తగిన పరిహారం బాధితురాలికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. నేరం జరిగిన తర్వాత విచారణ సమయంలో ప్రమోద్ తప్పించుకుని తిరగడంతో అతడిపై నాన్ బెయిలబుల్ వారెంటు కూడా జారీ చేశారు.

మరిన్ని వార్తలు