బెంగళూరులో మరో చిన్నారిపై అత్యాచారం

30 Jul, 2014 14:39 IST|Sakshi

భారతీయ సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన బెంగళూరులో మరో ఘోరం జరిగింది. నగర శివార్లలోని తన ఇంట్లో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ముందుగా శ్రీనివాస్ అనే ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించామని, అనంతరం అతడిని అరెస్టు చేశామని డీసీపీ లభు రామ్ తెలిపారు.

బాలిక తల్లి ఆమెను స్కూలు నుంచి తీసుకొచ్చి, శ్రీనివాస్ ఇంట్లో వదిలిపెట్టి బయటకు వెళ్లిన తర్వాత ఈ సంఘటన జరిగిందన్నారు. బాలికను ప్రభుత్వాస్పత్రిలో చేర్చి ఆమెకు వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. ఇటీవలే నగరంలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఇద్దరు జిమ్ ట్రైనర్లు అత్యాచారం చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సంఘటన ఇంకా మర్చిపోకముందే ఈ దారుణం బయటపడింది.

మరిన్ని వార్తలు