'అసెంబ్లీ జరిగిన తీరు దారుణం'

4 Sep, 2015 14:09 IST|Sakshi
'అసెంబ్లీ జరిగిన తీరు దారుణం'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభా సమావేశాలు 5 రోజులే నిర్వహించడం దారుణమన్నారు. చివరి రోజున ఓటుకు కోట్లుపై చర్చకు డిమాండ్ చేసినా పట్టించుకోలేదని వాపోయారు. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే...

  • అసెంబ్లీ జరిగిన తీరును మీరంతా గమనించే ఉంటారు
  • ఐదు రోజుల పాటు అసెంబ్లీ పెట్టడం అన్నది దారుణం
  • 15 రోజులు పెట్టమన్నా 5 రోజులే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం అన్యాయం
  • ఓటుకు కోట్లుపై వాయిదా తీర్మానం, 344 కింద నోటీసు ఇచ్చాం
  • సరైన పద్ధతిలో నోటీసు ఇవ్వలేదన్న వాదన పూర్తిగా అవాస్తవం
  • మొట్టమొదటి సారి దేశంలో ఎక్కడా జరగని విధంగా  చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే డబ్బు ఇస్తూ పట్టుబడటం జరిగింది.
  • ఇంత హార్ట్ కోర్ ఎవిడెన్స్ తో డబ్బు ఇస్తూ పట్టుబడితే అసెంబ్లీలో చర్చకు అనుమతి ఇవ్వకపోవటం దేశ చరిత్రలో తొలిసారి అనుకుంటా.
  • అధికారం ఉందని, స్పీకర్ స్థానం కూడా వారిదేనని. చర్చకు అవకాశం ఇవ్వకుండా చేయటం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు.
  • దొంగ దొంగతనం చేస్తూ పట్టుబడితే...దొంగతనం చేస్తూ పట్టుబడటం తప్పుకాదు. నన్ను పట్టుకోవటం తప్పు అన్నట్లు ఉంది.
  • చంద్రబాబు ఏపీలో లంచాలు తీసుకుని సంపాదించిన డబ్బు నల్లధనం. ఆ డబ్బును విరజిల్లుతూ పట్టుబడిన పరిస్థితి.
  • 8 మంది ఎమ్మెల్యేలను కొనడానికి సన్నద్ధం చేసుకోని 150 కోట్లు స్కామ్ చేశారు.
  • పట్టిసీమ నుంచి ఇసుక మాఫియా దాకా సాక్షాత్తూ సీఎంకే పర్సంటేజ్లు. మట్టి దగ్గర నుంచి బొగ్గు దాకా వాటాలే. సాక్షాత్తూ ముఖ్యమంత్రి భాగస్వామి కావటం. లంచాలు తీసుకోవటం.
  • ఓటుకు కోట్లు కేసు ఛార్జిషీట్ లో 22సార్లు చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావిస్తే...సీఎం అసెంబ్లీలో ఉండి. తన గది నుంచి బయటకు రాలేదు
  • అసెంబ్లీకి వచ్చి చర్చ ఇనిషియేట్ చేసి...చర్చలో తన వెర్షన్ ఏంటో చెప్పాల్సిన బాధ్యతను దాటవేశారు
  • వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందే. ఇక్కడే ఉండి కూడా సీఎం తప్పించుకున్నారు. మరి ఇదేంది?
  • డైరెక్ట్గా సీఎం ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయినా... చివరికి అసెంబ్లీకి వచ్చి ఆ గొంతు తనది కాదని చెప్పుకునే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు.
  • ఏ నైతిక హక్కుతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నారో...తన మనస్సాక్షిని అడగాలి.
  • ఇవాళ స్పీకర్ న్యాయంగా ప్రవర్తించి ఉంటే... వాయిదా తీర్మానంతో పాటు 344 ఇచ్చాం కాబట్టి తాను ఒక గంటసేపు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఉంటే...సభ వాయిదా వేయాల్సిన పనేముంది?
  • ఉదయం నుంచి నివరధిక వాయిదా పడేవరకూ ఓటుకు కోట్లు అంశంపై చర్చ ఎందుకు జరగకూడదని పట్టుబడితే... ఆ అంశం కోర్టులో ఉందని చెప్పారు.
  • అదే జగన్ మీద చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డి మీద కూడా కనీసం ఆరుమందితో తిట్టిస్తారు. ఒక్కడ్ని చేసి మైక్లు ఇవ్వరు.  తిట్టించిన తర్వాత సభను వాయిదా వేస్తారు.
  • ప్రత్యేక హోదాపై చర్చ జరగాలి. ఆ చర్చ వల్ల మంచి జరుగుతుందని వారికి అర్థం కావాలి
  • పోలవరం ప్రాజెక్ట్  నత్తనడకన జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని...కేంద్రం తిడుతూ లేఖలు రాసినా ఫలితం శూన్యం. ఈ అంశాన్ని అసెంబ్లీలో మాట్లాడకూడదట.
  • అన్ని ప్రాజెక్టులకు సంజీవని పోలవరం
  • పట్టిసీమ ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తున్నామని స్పష్టంగా చెప్పాం. కారణం స్టోరేజ్ లేదు
  • ఆ ప్రాజెక్ట్లో పెట్టే ఖర్చు వేస్ట్. ఇదే డబ్బుతో పులిచింతల,గాలేరు-నగరి ప్రాజెక్ట్లు పూర్తి అవుతాయి
  • కేవలం పోలవరం టెండర్లలో గోల్మాల్, ఏపీలో కాంట్రాక్టర్లు లేరట. ఇద్దరు మాత్రమే ఉన్నారట
  • 30 పంపులు, 15 పైప్ లైన్లు ఉంటే... వాటిని తగ్గించి చూపారు.
  • నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. కనీసం ఈ అంశంపైనా అసెంబ్లీలో చర్చించలేదు
  • రూ. 1000 కోట్లతో పెడతానని ప్రకటించిన ధరల స్థిరీకరణ నిధి ఏమైంది?
  • రాష్ట్రం విడిపోయిన 15 నెలలు గడుస్తున్నా ప్యూన్ పోస్టు కూడా ఇవ్వలేదు
  • డిఎస్సీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు ప్రకటించినా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు
  • ఇంతవరకు రిక్రూట్ మెంట్ కేలండర్ ప్రకటించలేదు
  • ఉద్యోగుల జీతాల గురించి పట్టించుకోవడం లేదు
  • నిరుద్యోగులకు వయో పరిమితి పెంచిన పాపాన పోలేదు
  • కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పి మాట మార్చారు
  • నిరుద్యోగ భృతి ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వలేదు
  • ప్రత్యేక హోదాపై గందరగోళంగా మాట్లాడతారు. ప్రజలను తికమక పెడతారు.
  • అసెంబ్లీ సజావుగా సాగక పోవడానికి చంద్రబాబు, స్పీకర్ బాధ్యులు
  • అసెంబ్లీ వేదికను చంద్రబాబు భ్రష్టు పట్టించారు.
  • ప్రత్యేక హోదాపై నిరాహారదీక్ష కచ్చితంగా చేస్తా. బహుశా 20న ఉండొచ్చు. 19న 20న అనేది పార్టీలో చర్చించి ఖరారు చేస్తాం.

మరిన్ని వార్తలు