‘విధి’ విజయం సాధించాలి

25 Nov, 2018 04:18 IST|Sakshi
పోస్టర్‌ ఆవిష్కరించిన వైఎస్‌ జగన్‌తో

వై.ఎస్‌. జగన్‌

రామ్, విష్ణుప్రియ, కల్పన ముఖ్య తారాగణంగా మారుతీ క్రియేషన్స్‌ పతాకంపై అరుణ్‌రెడ్డి బిల్లా దర్శకత్వంలో హనుమంతరెడ్డి నిర్మించిన చిత్రం ‘విధి’.   ఈ చిత్రం పోస్టర్‌ను వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించి, ‘‘ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అన్నారు.  విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వై.ఎస్‌. జగన్‌ను శనివారం చిత్రబృందం కలిసింది. చిత్రదర్శకుడు అరుణ్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘జగనన్న పాదయాత్ర మహోన్నతమైనది.   ఆయన చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా ఆయనతో కలిసి నడుస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో జగన్‌ అన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ సీపీ విద్యార్థి విభాగం కడప జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు