ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అరెస్ట్.. పుంగనూరులో ఉద్రిక్తత

19 Aug, 2015 18:56 IST|Sakshi
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అరెస్ట్.. పుంగనూరులో ఉద్రిక్తత

తిరుపతి: చిత్తూరు జిల్లా పుత్తూరులో పుంగనూరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యను నిరసిస్తూ పుంగనూరులో వైఎస్ఆర్ సీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు ధర్నా చేపట్టారు. దీంతో పుంగనూరులో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

ఇటీవల నగరి మున్సిపల్ చైర్పర్సన్ శాంతకుమారి ఇంటిపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ బుధవారం వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ధర్నా చేశాయి. నగరి మహా ధర్నాలో చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా నగరి శివార్లలో వైఎస్ఆర్ సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, రోజా, దేశాయి తిప్పారెడ్డి, గిడ్డి ఈశ్వరిలను పోలీసులు అడ్డుకున్నారు. పుత్తూరులో పెద్దిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చెవిరెడ్డి కాలుపై నుంచి పోలీసులు వాహనాన్ని తీసుకెళ్లడంతో ఆయన గాయపడ్డారు. చికిత్స నిమిత్తం తమిళనాడు పల్లిపట్టులోని ప్రభుత్వాసుపత్రికి చెవిరెడ్డిని తరలించారు.

>
మరిన్ని వార్తలు