'రాయలసీమంటే ఎందుకంత ద్వేషం'

23 Jun, 2016 14:58 IST|Sakshi
'రాయలసీమంటే ఎందుకంత ద్వేషం'

హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్పుడు హడావుడి చేస్తున్నారని అన్నారు. రాయలసీమ ప్రజల భవిష్యత్తును సర్వనాశనం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.

సీమకు నీళ్లివ్వాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. రాయలసీమ అంటే ఎందుకంత వివక్ష అని శ్రీకాంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అయితే సీమ ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారన్నారు. దేవినేని ఉమకు రాయలసీమంటే ద్వేషమని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని తాము అంటే పై పెచ్చు ప్రభుత్వం ఎదురు దాడి చేస్తోందన్నారు. అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశం తమ పార్టీకి ఏమాత్రం లేదన్నారు.

మరిన్ని వార్తలు