జెన్ కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్..ధర ఎంత?

28 Oct, 2016 14:15 IST|Sakshi
జెన్ కొత్త స్మార్ట్ఫోన్ లాంచ్..ధర ఎంత?

న్యూడిల్లీ: భారత మొబైల్ తయారీదారు జెన్ మొబైల్స్  తన కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేసింది.  సినిమాక్స్ పోర్ట్ఫోలియో లో సినిమాక్స్   2 ప్లస్ పేరుతో మరో కొత్త స్మార్ట్ ఫోను  జోడించింది. దీని ధరను  రూ.  3,777 గా నిర్ణయించింది.  ఎస్ ఓ ఎస్ కాలింగ్ తో అత్యవసరం సమమయంలో అయిదు  నెంబర్లకు  లొకేషన్ డీటెయిల్స్ అందింజే ఫీచర్ తో దీన్ని లాంచ్ చేసింది.   ఇది ప్రత్యేకంగా ఇ-కామర్స్ వెబ్సైట్ షాప్ క్లూస్ లో అందుబాటులో ఉంచినట్టు తెలిపింది.
జెన్ మొబైల్  పరిధిని విస్తరించడం సంతోషంగా ఉందని జెన్ సినిమాక్స్ 2 ప్లస్  ప్రారంభంపై   జెన్ మొబైల్స్ సీఈఓ  సంజయ్ కాలిరోనా వ్యాఖ్యానించారు. షాప్ క్లూస్ తో భాగస్వామ్యం ద్వారా మరింత వినియోగదారులను సాధించనున్నట్టుతెలిపారు. ఇది కచ్చితంగా విజయవంతమవుతందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  
 
జెన్  సినిమాక్స్ 2 ప్లస్  ఫీచర్లు
డ్యూయల్ సిమ్ 5.1 లాలిపాప్
5.5ఇంచెస్ డిస్ ప్లే
1.3 క్వాడ్ కోర్  ప్రాసెసర్
480x854 పిక్సెల్ రిజల్యూషన్
5 ఎంపీ రియల్ కెమెరా ఫ్లాష్  విత్  ఆటో ఫోకస్
3.2  ఎంపీఫ్రంట్ కెమెరా
1జీబీ  ర్యామ్, 8జీబీ స్టోరేజ్
32జీబీ ఎక్స్ పాండబుల్ మొమర
2900ఎంఏహెచ్ బ్యాటరీ
 

>
మరిన్ని వార్తలు