జొమాటో చేతికి యూఎస్ సంస్థ

14 Jan, 2015 02:06 IST|Sakshi
జొమాటో చేతికి యూఎస్ సంస్థ

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ రెస్టారెంట్ గైడ్ కంపెనీ జొమాటో తాజాగా అమెరికాకు చెందిన అర్బన్‌స్పూన్ సంస్థను కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం విలువ 60 మిలియన్ డాలర్లని (సుమారు రూ. 360 కోట్లు) సమాచారం. స్థానిక రెస్టారెంట్ల సమాచారాన్ని అందించే అర్బన్‌స్పూన్ కొనుగోలుతో.. జొమాటో అమెరికా మార్కెట్లోకి ప్రవేశించినట్లయింది. అలాగే కెనడా, ఆస్ట్రేలియాలోనూ కార్యకలాపాలు విస్తరించడానికి ఇది ఉపయోగపడనుందని సంస్థ వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ తెలిపారు. త్వరలో ఇరు సంస్థల యాప్స్‌ను అనుసంధానించనున్నట్లు ఆయన తెలియజేశారు. తాజా డీల్‌తో మొత్తం 22 దేశాల్లో కార్యకలాపాలు విస్తరించినట్లవుతుందని గోయల్ పేర్కొన్నారు. జొమాటో ఇప్పటికే బ్రిటన్, న్యూజిలాండ్ తదితర దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. గత ఆరు నెలల్లో జొమాటో చేసిన కొనుగోళ్లలో ఇది ఆరోది. న్యూజిలాండ్, పోలండ్, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, ఇటలీ దేశాల్లో స్థానిక రెస్టారె ంట్ల వివరాలను అందించే సంస్థలను కొనుగోలు చేసింది.
 

మరిన్ని వార్తలు