జుకర్బర్గ్ భారీమొత్తంలో షేర్ల విక్రయం

20 Aug, 2016 09:35 IST|Sakshi
జుకర్బర్గ్ భారీమొత్తంలో షేర్ల విక్రయం

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్, తన దాతృత్వ సంస్థకు ఫండ్ కోసం భారీ మొత్తంలో స్టాక్ను విక్రయించారు. 95 మిలియన్ డాలర్ల(రూ. 637కోట్లకు పైగా) విలువ చేసే 760,000లకు పైగాఫేస్బుక్ స్టాక్ లోని షేర్లను విక్రయించినట్టు రెగ్యులేటరీకి సమర్పించిన ఫైలింగ్లో జుకర్బర్గ్ పేర్కొన్నారు. చాన్ జుకర్బర్గ్ ఇనీషియేటివ్ హోల్డింగ్స్, చాన్ జుకర్బర్గ్ ఫౌండేషన్ ద్వారా ఈ విక్రయం జరిపినట్టు వెల్లడించారు. 122.85 డాలర్ల నుంచి 124.31 డాలర్ల శ్రేణిలో ఈ షేర్ల ధరలు నమోదయ్యాయి. చాన్ జుకర్బర్గ్ ఇనీషియేటివ్ ద్వారా హెల్త్, సైన్సు, ఎడ్యుకేషన్ సమస్యల పరిష్కారానికి ఫండ్ను అందించడానికి జుకర్బర్గ్ ఇంతమొత్తంలో షేర్లను విక్రయిచడం ఇదే మొదటిసారి. తన కూతురు మాక్స్ పుట్టిన సందర్భంగా 2015లో తన కంపెనీలోని 99 శాతం షేర్లను అంటే 45 బిలియన్ డాలర్లను దానం చేసేయాలని జుకర్బర్గ్, ఆయన భార్య ప్రిన్సిలా చాన్ నిర్ణయించారు.

ప్రపంచాన్ని సంతోషంగా, ఆరోగ్యకరంగా చూసేందుకు చాన్ జుకర్ బర్గ్ ఇనీషియేటివ్ను ప్రారంభిస్తున్నామని కూడా పేర్కొన్నారు. మనుషుల శక్తి సామర్థ్యాలు, సమానత్వాన్ని పెంచేందుకు, వ్యాధులకు చికిత్స చేసేందుకు, సమానహక్కులు కల్పించి, కమ్యూనిటీస్లను అభివృద్ధి చేసేందుకు ఈ ఇనీషియేటివ్ తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రకటించిన నెలలోనే 99 శాతం ఫేస్బుక్ షేర్లను చాన్ జుకర్బర్గ్ ఇనీషియేటివ్కు ట్రాన్సఫర్ చేసినట్టు తెలిపారు. వచ్చే మూడేళ్ల తర్వాత నుంచి ఫండ్ కోసం వార్షికంగా 1 బిలియన్ వరకు షేర్లను విక్రయించనున్నట్టు కూడా వెల్లడించారు. 

>
మరిన్ని వార్తలు