ఛత్తీస్గఢ్లో మ్యాజిక్ ఫిగర్ ను దాటిన బీజేపీ

8 Dec, 2013 21:20 IST|Sakshi

ఛత్తీస్గఢ్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను అందుకుంది.  మొత్తం 90 స్ఠానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 49 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్ కు షాకిచ్చింది. కాంగ్రెస్ 39స్థానాల్లో మాత్రమే సరిపెట్టుకుంది. బీస్సీపీ అభ్యర్థి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు గెలుపొందారు.

రాజ్‌నంద్‌గాం నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ 35,866 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రమణ్ సింగ్‌కు 86,797 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి అల్కా ముదిలియార్‌కు 50,931 ఓట్లు వచ్చాయి. అల్క భర్త మావోయిస్టుల దాడిలో  మృతి చెందారు.

ఛత్తీస్‌గఢ్‌ ఉన్నత విద్యాశాఖ మంత్రి రామ్‌ విచార్‌ నేతం 11,592 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఛత్తీస్‌గఢ్ వ్యవసాయశాఖ మంత్రి చంద్రశేఖర్‌ సాహు కూడా ఓడిపోయారు. కాంగ్రెస్‌ అభ్యర్థి ధనేంద్ర సాహు పై 8354 ఓట్ల మెజార్టీతో ఓటమి పాలయ్యారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో  బీజేపీ 50 సీట్లతో అధికారాన్ని చేజిక్కించుకోగా, 38 స్టానాలతో కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు