బీఎస్పీ ఎంపీపై అత్యాచారం కేసు నమోదు

14 Nov, 2013 19:38 IST|Sakshi
బీఎస్పీ ఎంపీపై అత్యాచారం కేసు నమోదు
పనిమనిషి హత్యకేసులో జైలు పాలైన బహుజన్ సమాజ్ పార్టీ (బీస్పీ) ఎంపీ ధనుంజయ్ సింగ్ పై తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్ లో బుధవారం సాయంత్రం అత్యాచార కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశారని మహిళ చేసిన ఆరోపణలపై ఎంపీ ధనంజయ్ పై సెక్షన్ 376, 506 కింద కేసు నమోదు చేశారు. 
 
2005, 2009 సంవత్సరాల మధ్యకాలంలో ఎంపీని తన భర్త డిన్నర్ కు ఆహ్వానించారని, ఆ సమయంలో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు చేసింది అని పోలీసు అధికారి వెల్లడించారు. అత్యాచార విషయం ఎవరికైనా తెలియచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించడంతో ఆసమయంలో ఎంపీపై ఫిర్యాదు చేయడానికి ధైర్యం చేయలేదని పోలీసులు తెలిపారు. ఎంపీతోపాటు ఆయన సతీమణి జాగృతి సింగ్ ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.  ఉత్తర ప్రదేశ్ లోని జాన్ పూర్ లోకసభ నియోజకవర్గం నుంచి ధనుంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
మరిన్ని వార్తలు