ప్రయోగం ప్రాణం మీదకు వచ్చే..

5 May, 2017 20:30 IST|Sakshi
నడిమిచెర్ల(కలకడ): బాలుడి ప్రయోగం వికటించి–తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలైన సంఘటన కలకడ మండలం నడిమిచెర్ల గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి . జింకల.క్రిష్ణయ్య, సరస్వతిల కుమారుడు గణేష్‌ స్థానిక జిల్లాపరిషత్‌ఉన్నతపాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇతనికి చిన్నతనం నుంచి ప్రతి పనిలో ప్రయోగాలు ఎక్కువగా చేసేవాడు. వేసవి సెలవుల్లో ఇంటివద్ద ఉండి ప్రయోగాలలో బాగంగా శుక్రవారం ఉదయం టపాకాయల నుంచి నల్లమందును సేకరించి, పాకెట్లు చేసి అందులో వత్తిని ఏర్పాటు చేశాడు.

ఆ వత్తికి నిప్పుపెట్టి ఆకాశంలోకి వదులుతున్నట్లు తన మిత్రులకు తెలియజేశారు. అయితే అంతలో నిప్పు అంటించిన నల్లమందు ఒక్క సారిగా చేతిలోనే పేలిపోయింది. దీంతో పెద్ద శబ్దం వచ్చి విద్యార్థి కిందపడిపోయాడు. ఆశబ్దానికి వీధిలోకి వచ్చిన పెద్దలకు చిన్నారి గణేష్‌ కుడి చెయ్యి నుంచి రక్తం అధికంగా రావడం గమనించి అదుపు చేయడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆనొప్పికి చేతిని విదిలించగా గాయపడ్డ కుడి చేతిలోని మూడు వేళ్ళు వీధిలోనే రాలిపోయాయి. వెంటనే ద్విచక్రవాహణంలో మదనపల్లెకు తరలించారు.

ఇక్కడ బాంబులు తయారు చేస్తున్నట్లు పోలీసులు సైతం అక్కడికి చేరుకున్నారు. అక్కడ విచారించగా బాంబులు కాదని చిన్నారి ప్రయోగం వికటించిందని తెలియజేయడంతో చిన్నారులు ఆటలు ఆడుకోవడం తప్పు కాదని, అయితే తెలియని ప్రయోగాలతో ప్రమాదాలు కొని తెచ్చుకోవడం మంచిది కాదని హితవు పలికారు. చిన్నారులు చేసే పనులు పెద్దలు గమనించాలని కోరారు. ఈకార్యక్రమంలో పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు