కేబీసీలో డిగ్రీ విద్యార్థినికి కోటి రూపాయలు!

28 Nov, 2013 13:58 IST|Sakshi
కేబీసీలో డిగ్రీ విద్యార్థినికి కోటి రూపాయలు!
ప్రఖ్యాత రియాల్టీ గేమ్ షో కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) లో ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఫిరోజ్  ఫాత్మా 2013లో కోటి రూపాయలు గెలుచుకున్న తొలి మహిళగా ఘనతను సాధించింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో ఫాత్మా కోటి రూపాయలు సొంతం చేసుకున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. 2013లో చిట్టచివరి ఎపిసోడ్ లో ఉత్తర ప్రదేశ్ కు లోని సహరణ్ పూర్ కు చెందిన ఓ డిగ్రీ విద్యార్ణిని భారీ మొత్తాన్ని గెలుచుకోవడం విశేషం. 
 
ప్రేక్షకుల చప్పట్టు, అమితాబ్ కౌగిలించుకునేంత వరకు నమ్మకం కలుగలేదని ఫాత్మా తెలిపింది. దీర్ఘకాలంగా అనారోగ్యం పాలైన తన తండ్రి రుణాన్ని తీర్చడానికి కేబీసీని ఎంచుకున్నానని పాత్మా మీడియాతో అన్నారు. కోటి రూపాయలు గెలుచుకోవడం గొప్ప అనుభూతి అని అన్నారు. దినపత్రికలు, న్యూస్ చానెల్స్ ను చూడటం వల్లే తనకు జనరల్ నాలెడ్జి పెరిగిందని అన్నారు. అప్పుల  తన తండ్రిని రుణ విముక్తి చేయడానికి, భవిష్యత్ లో ఉన్నత చదువులకు భారీ మొత్తాన్ని వినియోగిస్తాను అని తెలిపారు. 
 
2000 లో ప్రారంభమైన కేబీసీకి 'హూ వాంట్స్ టూ బీ ఏ మిలియనీర్' అనే కార్యక్రమం ఆధారం. గతంలో షారుఖ్ ఖాన్ కూడా ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. 
 
మరిన్ని వార్తలు