మెదక్, నల్లగొండల్లో చలి ప్రతాపం

14 Nov, 2016 02:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్య భారతం నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని, మరో నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందని, చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వారం రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో మెదక్, నల్లగొండల్లో చలి ప్రతాపం చూపింది. మెదక్‌లో సాధారణం కంటే ఐదు డిగ్రీల తక్కువగా 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది.

నల్లగొండలో ఆరు డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో నాలుగు డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం, హన్మకొండల్లో 3 డిగ్రీలు తక్కువగా 17 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లో 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

>
మరిన్ని వార్తలు