ఆ కుటుంబం అభిమానానికి దాసోహం..

16 Apr, 2017 22:27 IST|Sakshi
ఆ కుటుంబం అభిమానానికి దాసోహం..

- ఘనంగా శివాజీ, కామరాజనాడార్‌ విగ్రహాల ఆవిష్కరణ

నగరి: అభిమానానికి శివాజీ కుటుంబం ఎప్పుడూ దాసోహమేనని నటుడు శివాజీ గణేశన్‌ మనవడు, ప్రభు కుమారుడు విక్రమ్‌ ప్రభు అన్నారు. ఆదివారం సాయంత్రం మున్సిపల్‌ పరిధి సత్రవాడలో శివాజీ గణేశన్‌ అభిమాని దివంగత మునియప్పన్‌ జ్ఞాపకార్థం నిర్మించిన దివంగత శివాజీ గణేశన్‌ విగ్రహం, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్‌ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి పెదనాన్న రామ్‌కుమార్‌తో పాటు ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1998లో తన తాత కామరాజనాడార్‌ విగ్రహావిష్కరణకు విచ్చేశాడు.

నేడు ఆయన విగ్రహావిష్కరణకు తాను విచ్చేయడం ఎనలేని సంతోషాన్ని ఇస్తోందన్నారు. నటనకు హద్దులు లేవని తన తాత శివాజీ గణేశన్‌ నిరూపించారని అన్నారు. అందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఓ పండుగలా చేయడమే నిదర్శనమని అన్నారు. తన తాత, తండ్రి బాటలోనే తాను కూడా ప్రజల అభిమానాన్ని పొందడానికి కృషి చేస్తున్నాను. రామ్‌కుమార్‌ మాట్లాడుతూ.. కామరాజనాడార్‌ తన తండ్రికి ఆదర్శమన్నారు. నేడు వారి ఇద్దరి విగ్రహాలు ఒకేచోట ఆవిష్కరించడం అభినందనీయమన్నారు.

మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కేజే.కుమార్‌ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను శివాజీ గణేశన్‌ అభిమానినని, రాజకీయంగా తనకు మార్గం చూపింది ఆ కుటుంబమే అన్నారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్‌ వీఎస్‌.భానుమూర్తి, భారతదేశ శివాజీ సంఘం నిర్వాహకులు మరుదుమోహన్, చంద్రశేఖర్, జయపెరుమాళ్, స్థానిక నాయకులు వరదప్ప మొదలియార్, రామచంద్రన్, ఏకనాథన్, దేవన్, ఏకాంబరం, శ్రీనివాసన్, ఇలంగో, రాజా, కుమార్, నటరాజన్, వినాయకం, జయరామన్, కృష్ణన్, సీఎస్‌.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Top-stories News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆడుకుంటూ.. అనంతలోకాలకు..

‘స్వేచ్ఛా ప్రతిమ’...

విప్లవ ‘నారీ’.....విజయ భేరీ

‘వీర’....నారికి జోహార్‌

కాసినికి 20 ఏళ్లు

టుడే రౌండప్‌: ఇంపార్టెంట్‌ అప్‌డేట్స్‌ ఇవే!

ప్రయోగం ప్రాణం మీదకు వచ్చే..

టెక్నాలజీనా.. మజాకా!

ప్రశ్నించినందుకు ప్రాణం పోయింది!

వాట్సప్‌లో వీడియో.. 12మంది భవిష్యత్‌?

ప్రాణాలు తీసిన ఇసుక దందా

వాట్సాప్లో దుష్ప్రచారం చేస్తే..

బ్లడ్‌బ్యాంక్‌ సిబ్బంది నిర్లక్ష్యంతో..

ఖుషీ ఖుషీగా చెన్నై చిన్నది..

రూ.2వేల నోటుతో అంధులకు చిక్కు..

ఆశపడింది.. దొరికిపోయింది!

డస్ట్‌బిన్‌లో అంత బంగారం దొరికిందా..?

నయనకే విలనయ్యా!

కత్తి పట్టిన హీరోయిన్‌..

కన్నీటితో వెలుతున్నా.. ఓ తల్లి ఆవేదన

కట్నం వేధింపులు.. ఐఆర్‌ఎస్‌ అధికారి అరెస్టు

విదేశీ మహిళకు టోకరా: వెల్వో ట్రావెల్స్‌ డైరెక్టర్‌ అరెస్ట్‌

చాటింగ్‌.. చీటింగ్‌!

వీసా లేకుండా రష్యా వెళ్లొచ్చు..

ప్రేమలో కూతురు మోసపోయిందని తండ్రి..

పాపం ‘ప్రిన్స్‌’

కష్టాల్లో నటి భూమిక!

ఆలోచనలు మాత్రం ఆకాశమంత ఎత్తు..

సమ్మర్‌ బరిలో గెలిచెదేవరు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటికి ముందస్తు బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష