పాపం ‘ప్రిన్స్‌’

16 Apr, 2017 19:44 IST|Sakshi
పాపం ‘ప్రిన్స్‌’

► అరణ్య భవన్‌ వద్ద నిరసన తెలుపుతున్న వన్యప్రేమికులు
 

బెంగళూరు: ఇటీవల బండీపుర అడవుల్లో అనుమానాస్పదంగా మృతి చెందిన పులి ప్రిన్స్‌ ముఖ భాగాలు అదే అటవీ ప్రాంతంలో లభించడంపై పులి మృతిపై ఉన్నతస్థాయి విచారణ చేయాలని డిమాండ్లు తీవ్రమవుతున్నాయి. బండీపుర నేషనల్‌ పార్క్‌లోని కుందకెరె అటవీ ప్రాంతంలో ప్రిన్స్‌గా పిలుచుకునే పులి మృతదేహం లభించింది. మృతదేహాన్ని పరిశీలించిన అటవీ అధికారులు పులి పిడుగుపాటుకు మృతి చెంది ఉంటుందని అంతిమ సంస్కారం చేశారు. అయితే ఇది జరిగిన కొద్ది రోజులకే కొందరు వేటగాళ్లు పులి దవడ ఎముకలు, కోరలు, పళ్లు అపహరించుకుని పోయినట్లు గుర్తించారు.

అటవీ ప్రాంతంలో లభించిన పులి ముఖ భాగాన్ని పరిశీలించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ ప్రయోగశాలకు పంపించినట్లు పశువైద్యుడు నాగరాజు తెలిపారు. ఇదిలా ఉంటే అనుమానాస్పద మృతిపై విచారణ చేయాలని వన్యప్రేమికులు ఆదివారం బెంగళూరు అటవీ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన చేశారు.

సహజ మరణం :‘సహజంగానే మృతి చెందిన పులిని గమనించిన కొందరు వేటగాళ్లు ఆయుధాలతో పులి ముఖభాగాన్ని వేరు చేసి దవడ ఎముకలు, కోరలు, పళ్లను అపహరించారు. వారి కోసం గాలిస్తున్నాం’ –ఏ.టీ.పూవయ్య, అసిస్టెంట్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్, గుండ్లుపేట

మరిన్ని వార్తలు