మందుల కన్నా..కషాయాలే మేలు

19 Nov, 2014 23:40 IST|Sakshi

టమాటా
 ఆ కాయతొలుచు పురుగు: ఇది పంటను అధికంగా ఆశిస్తుంది. లేత ఆకులు, కొమ్మలను తినేస్తుంది. కాయలను తొలిచి నాశనం చేస్తుంది. దీని నివారణకు లీటరు నీటిలో రెండు గ్రాముల చొప్పున నీటిలో కరిగే కార్బోరిల్ పొడిని కలుపుకుని పిచికారీ చేయాలి.

 ఆ పచ్చదోమ, పిల్లపురుగు: పెద్ద పురుగు ఆకు అడుగు భాగాన ఉండి రసం పీలుస్తుంది. ఆకులు వడిలిపోతాయి. మొక్కలు చేవ తగ్గి దిగుబడులు తగ్గుతాయి.
 దీని నివారణకు లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల మెటాసిస్టాక్ మందును కలుపుకుని పిచికారీ చేయాలి.

 వంగ
 అక్షింతల పురుగు: వీటిలో పెద్ద పురుగులు, పిల్ల పురుగులు ఆకులను తింటాయి. దీంతో మొక్కలు శక్తిహీనంగా మారుతాయి. వీటి నివారణకు లీటరు నీటిలో మూడు మిల్లీలీటర్ల మలాథియాన్, లీటరు నీటిలో .03 శాతం మిథైల్ పెరాథియాన్ కలిపి పిచికారీ చేయాలి.

 బెండ
 పువ్వు, కాయ తొలుచు పురుగు: ఇవి లేతకొమ్మలు, ఆకులు, కాయలను తొలిచి గింజలతో సహా లోపలి భాగాలను తినేస్తాయి. వీటి నివారణకు పురుగు ఆశించిన కొమ్మలు, కాయలను తుంచి దూరంగా పడేయాలి. లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల క్వినాల్‌ఫాస్ మందు లేదా మూడు లీటర్ల నీటిలో 0.15 శాతం మందును కలిపి పిచికారీ చేయాలి.

మరిన్ని వార్తలు