సాగులో ‘సహకార’o

25 Aug, 2014 01:22 IST|Sakshi

ముథోల్ : సహకార సంఘం ఆ గ్రామ రైతులను అభివృద్ధి వైపు నడిపిస్తోంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు తక్కువ ధరకే విక్రయిస్తూ మరికొందరు రైతులకు చేయూతనిస్తోంది. పంటలకు వచ్చే తెగుళ్లు, చీడపీడలపై అవగాహన కల్పిస్తూ.. సూచనలు, సలహాలు అందిస్తూ ఆసరాగా నిలుస్తోంది. మండలంలో ని ఎడ్‌బిడ్ గ్రామంలో 2007 జనవరి మొదటి వారంలో 36 మంది రైతులు కలిసి మల్లికార్జున పరస్పర సహకార పొదుపు సంఘం ఏర్పాటు చేసుకున్నారు. సభ్యత్వ నమోదు కోసం రూ.వెయ్యి, రూ.1,500 చొప్పున చెల్లించారు.

ఈ సంఘానికి చైర్మన్‌తోపాటు తొమ్మిది మంది డెరైక్టర్లను ఎన్నుకున్నారు. ప్రతి నెల ఒక్కో సభ్యుడి నుంచి రూ.50 చొప్పున సేకరించి పొదుపు చేస్తున్నారు. ప్రతీ నెల ఐదో తేదీన సమావేశం ఏర్పాటు చేసి సంఘం కార్యకలాపాలపై సమీక్షిస్తారు. ఇలా పొదుపు చేసిన డబ్బులతో రూ.15లక్షలు వెచ్చించి సంఘ భవనాన్ని నిర్మించారు. 36మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంఘంలో ప్రస్తుతం 46 మంది సభ్యులు ఉన్నారు. నాలుగేళ్లలో సంఘానికి పొదుపు, ఇతర వనరుల ద్వారా రూ.కోటీ 50లక్షలు సమకూరిందని సంఘం అధ్యక్షుడు నర్సారెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు