వ్యాధులకు తెర

19 Nov, 2014 03:13 IST|Sakshi

శీతాకాలంలో పశువుల్లో వచ్చే వ్యాధులు
 గొంతు వాపు వ్యాధి
 ఇది పాశ్యురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఎక్కువగా ఒక పశువు నుంచి మరో పశువుకు, నీరు, మేత, శరీర ద్రవాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన పశువులో అధిక జ్వరం, గొంతువాపు, గురక లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన పశువులు 48 గంటల వ్యవధిలో చనిపోతుంటాయి. నివారణకు ఆరు నెలలు పైబడిన పశువులకు ఈ వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలి. ఆ తర్వాత  ఏటా వ్యాధి నివారణ కోసం టీ కాలు వేయిస్తూ ఉండాలి.  
 
జబ్బ వాపు
 కాస్ట్రీడియం అనే బాక్టీరియా వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన పశువులో జ్వరం, తుంటి కండరాల్లో నొప్పి, వాపు లక్షణాలు కనిపిస్తాయి. నివారణకు వర్షాకాలం ముందు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.
 
పొట్ట జలగ వ్యాధి  
 ఇది వర్షాల వల్ల, ఎక్కువగా నిల్వ ఉన్న నీటిని తాగడం వల్ల, నత్తల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి పశువులు నిల్వ ఉన్న నీటిని తాగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 
గొర్రెల్లో వచ్చే వ్యాధులు..
 నీలి నాలక వ్యాధి : ఇది క్యూలికాయిడిస్ అనే ఇన్‌సెక్ట్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. నివారణకు ముందస్తు టీకాలు వేయించాలి.
 ఫుట్‌రాట్ : ఈ వ్యాధి శీతాకాలంలో గొర్రెలు, మేకల్లో ఎక్కువగా వస్తుంది. దీని వల్ల కాలివేళ్ల మధ్య ఎర్రగా మారడం, వాపు, పగుళ్లు రావడం, కుంటడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణకు కాపర్‌సల్ఫేట్ లేదా పొటాషియం పర్మాంగనేట్‌తో గొర్రెల పాకలను శుభ్రం చేయాలి. కాళ్లపై గాయాలు, పుండ్లు ఏర్పడితే యాంటీ బయాటిక్స్ వాడాలి.

మరిన్ని వార్తలు