రైతన్నా మేలుకో.. పంటలను కాపాడుకో

14 Aug, 2014 23:57 IST|Sakshi
రైతన్నా మేలుకో.. పంటలను కాపాడుకో

* వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన శాస్త్రవేత్తలు
* మొక్కజొన్న, పత్తికి ఆశించే తెగుళ్ల నివారణకు సలహాలు, సూచనలు
* రోలింగ్ స్టెమ్ అప్లికేటర్ వాడకంపై అన్నదాతలకు అవగాహన

 
 సదాశివపేట: ఆరుతడి, వర్షాధార పంటలైన మొక్కజొన్న, పత్తి సాగులో చీడపీడల నివారణకు చర్యలు చేపట్టి ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని సంగారెడ్డి ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్. ఏ శ్రీనివాస్ 9989623819, శాస్త్రవేత్త డాక్టర్. ఎం శ్రీనివాస్ 9440512029 రైతులకు సూచించారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు సాగు చేస్తున్న మొక్కజొన్న, పత్తి పంటలను గురువారం సందర్శించిన వీరు రైతులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు.
 
 మొక్కజొన్నలో కాండం తొలిచే పురుగు...
 ప్రస్తుతం మొక్కజొన్న పంటల్లో కాండం తొలుచు పురుగు లక్షణాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు మొవ్వులో చేరే కాండం తొలిచే, లద్దె పురుగులు లేత ఆకులను తింటాయని పేర్కొన్నారు. దీనివల్ల ఆకులపై వరుస క్రమంలో రంధ్రాలు ఏర్పడడంతో పాటు వాటి విసర్జితాలు కనిపిస్తాయన్నారు. మొవ్వను పట్టుకుని లాగినట్లయితే సులభంగా ఊడి వస్తుందని వివరించారు. వర్షాభావ పరిస్థితుల్లో దీని తీవ్రత అధికంగా ఉంటుందని సూచించారు. కాండం తొలుచు పురుగు నివారణకు కార్బోఫ్యురాన్ 3జీ గుళికలను ఇసుకలో కలుపుకుని మొవ్వులో పడే విధంగా వేయాలని తెలిపారు.
 
 పత్తి పంటలకు తెల్ల దోమ, పిండి నల్లి...
 పత్తి పంటలకు తెల్ల దోమ, తామర పురుగు, పిండినల్లి ఆశించినట్లు గుర్తించామని తెలిపారు. దీని నివారణకు లీటరు నీటిలో పావులీటర్ మోనోక్రొటోఫాస్ మందును లేదా ఐదు లీటర్ల నీటిలో కిలో ఇమిడాక్లోప్రిడ్ పౌడర్‌ను కలిపి కాండం లేత భాగంపై రుద్దాలని సూచించారు. పంట విత్తిన 20, 40, 60, 80 రోజుల దశలో మోనోక్రొటోఫాస్ మందును మొక్క కాండంపై పూస్తే రసం పీల్చే పురుగుల ఉధృతిని నివారించవచ్చని సూచించారు. ఇలా చేస్తే పంటపై పురుగు మందును పిచికారీ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ విధానంతో మిత్ర పురుగులు, వాతావరణానికి ఎలాంటి కీడు జరగదని చెప్పారు.
 
పత్తి మొక్కపై మందును పూయడానికి ‘కృషి విజ్ఞాన్ కేంద్రం వైరా’ వారి సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన రోలింగ్ స్టెమ్ అప్లికేటర్‌ను వినియోగించి తక్కువ శారీరక శ్రమతో పని పూర్తి చేయవచ్చని వివరించారు. ఈ పరికరం అవసరమైన రైతులు సంగారెడ్డిలోని ఏరువాక కేంద్రంలో సంప్రదించాలని తెలి పారు. రోలింగ్ స్టిమ్ అప్లికేటర్ వినియోగించే విధానాన్ని క్షే త్ర స్థాయిలో రైతులకు ప్రదర్శించి చూపించారు. వర్షాభావ పరిస్థితుల్లో నేలలో తగినంత తేమ  లేని పక్షంలో 0.2 శాతం యూరియా (2 గ్రాములు) లీటర్ నీటికి కలిపి అన్ని పం టలపై పిచికారీ చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమ ంలో మండల వ్యవసాయ అధికారి బాబునాయక్, ము నిపల్లి  ఏఓ శివకుమార్, సదాశివపేట మండల వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్, ఆత్మ బీటీఎం షేక్‌అహ్మద్, రైతులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు