బీ(ధీ)మా లేక బిక్కుబిక్కు!

8 Nov, 2014 00:01 IST|Sakshi

ప్రమాదంలో పశువులు మృత్యువాతపడితే రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రవేశపెట్టిన బీమా పథకం నిర్లక్ష్యానికి గురవుతోంది. గడువు ముగిసి నెలరోజులు గడిచినా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయకపోవడంపై పశుపోషకులు, అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగి జీవాలు మరణిస్తే తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 రాష్ట్ర ప్రభుత్వం ఆవులు, గేదెలు, గొర్ల కోసం బీమా పథకం ప్రవేశపెట్టింది. మూగజీవాలు మృతి చెందితే ఇన్సూరెన్స్ ఉన్న రైతులకు పరిహారం చెల్లిస్తుంది. ప్రభుత్వం గత సంవత్సరం న్యూఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోవడంతో అక్టోబర్ 18 నుంచి నవంబర్ వరకు ప్రీమియం కట్టుకునేం దుకు గడువు విధించారు. దీంతో జిల్లా వ్యాప్తం గా 4,626 మంది రైతులు బీమా డబ్బులు చెల్లించగా, సిద్దిపేట డివిజన్‌లో 1,650 మూగజీవాలకు రైతులు ఇన్సూరెన్స్ చేయించారు.

 రైతు ఒక్కో గేదెకు ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు రూ.10 నుంచి రూ.30 వేల వ రకు బీమా చేయించుకునే సదుపాయం కల్పిం చారు. ఇన్సూరెన్స్ చేయించుకున్న పశువులను వెటర్నరీ వైద్యులు పరీక్షించిన అనంతరం సర్టిఫైడ్ చేసిన తర్వాత పశువులకు పోగులు వేసి వాటిని ఫొటోలను బీమా కంపెనీ వారికి అందజేస్తారు.

ఒక్క గేదె లేదా ఆవుకు ప్రీమియం కట్టుకుంటే రూ.50 వేలు, రెండు కంటే ఎక్కువ పశువులకు బీమా కట్టి అవి చనిపోతే రూ.2 లక్షల వరకు పరిహారం చెల్లిస్తారు. ఇదే కాకుం డా పశువులకు బీమా చేయించిన ప్రమాదవశాత్తు చనిపోతే అతనికి కూడా బీమా వర్తించేది. దీంతో అనుకోని సంఘటనలు ఏవైనా జరిగితే బాధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత అందేది.  

 పట్టించుకోని ప్రభుత్వం...
 బీమా గడువు అక్టోబర్ నెలతో ముగిసినా ప్రభుత్వం ఇప్పటి వరకూ విధివిధానాలు ప్రకటించలేదు. జిల్లా వ్యాప్తంగా అందరు రైతులు తమ పశువులకు సంవత్సరం వరకే బీమా చేయించి నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పశువుల బీమా ముగిసిన 15 రోజుల వరకు గ్రేస్ పీరి యడ్ ఉంటుంది.  ఇది కూడా ముగి యడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

సీజన ల్ వ్యాధులు ప్రబలడంతో పాటు చాల చోట్ల ఎన్నో మూగజీవాలు ప్రమాదవశా త్తు మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యం లో అక్టోబర్ మాసంలోనే ప్రీమియం గడువు ముగిసినా ప్రభుత్వం గైడ్‌లైన్స్ ప్రకటించకపోవడంతో రైతులకు నష్టం జరిగే అవకాశముంది. అధికారులు   స్పందించి ఇన్సూరెన్స్ మార్గదర్శకాలు జారీ చేయాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు