శ్రేష్టమైన పశుగ్రాసం ‘న్యూట్రిఫీడ్’

14 Nov, 2014 00:10 IST|Sakshi

విత్తుకునే విధానం: న్యూట్రిఫీడ్‌ను అన్ని రకాల నేలల్లో విత్తుకోవచ్చు. దీని వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఆరోగ్యవంతమైన పిలకలు వచ్చేం దుకు విత్తనాలను 2-3 సెంటీ మీటర్లు లోతులో వేయాలి. మొక్కకు మొక్కకు మధ్య సుమారు 25 సెంటీమీటర్ల దూరం, సాలుకు సాలుకు మధ్య సుమారు 30 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇలాగైతే మొదటి కోత అనంతరం ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది.

 నీటి పారుదల: న్యూట్రిఫీడ్ నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అయినా తేలిక నేలల్లో 5-7 రోజులకు ఒక తడి, బరువు నేలల్లో 7-10 రోజులకు ఒక తడి నీటి అవసరం ఉంటుంది.

 లాభాలు: న్యూట్రిఫీడ్ తినడం ద్వారా పశువులు ఎక్కువ రోజులు పాలిస్తాయి. పాల ఉత్పత్తి, వెన్నశాతం పెరుగుతుంది. ఈ పశుగ్రాసం తినడం ద్వారా పశువులు సరైన సమయంలో గర్భధారణ అవుతాయి. ఇతర దాణా ఖర్చులు తగ్గుతాయి. విత్తిన సమయంలో మంచి ఎరువులు వేసుకుంటే 40 రోజుల్లో మొదటి దఫా కోతకు వస్తుంది. ప్రతి కోత తర్వాత ఎకరాకు 50 కిలోల యూరియా వేసుకుంటే ఆరోగ్యవంతమైన పశుగ్రాసం పెరుగుతుంది.

>
మరిన్ని వార్తలు