10,11 తేదీల్లో బెంగళూరులో ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌

8 Aug, 2017 00:42 IST|Sakshi
10,11 తేదీల్లో బెంగళూరులో ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌

వ్యవసాయ ఇంజనీరింగ్‌లో సరికొత్త పోకడలను, ఆవిష్కరణలను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా బెంగళూరులోని నిమ్‌హాన్స్‌ ప్రాంగణంలో ఈ నెల 10, 11 తేదీల్లో ‘ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌ 4.0’ జరగబోతోంది.

ఈ కాంగ్రెస్‌లో వ్యవసాయ ఇంజనీరింగ్‌కు పెద్ద పీట వేస్తున్నారు. పండ్ల తోటలు, సీజనల్‌ పంటల సాగులో విత్తనం వేయడం దగ్గర నుంచి, వనరులను అవసరం మేరకు పొదుపుగా తగిన సమయంలో వినియోగించడం, మట్టిలో తేమను తెలిపే సెన్సార్లు, వివిధ పనులను చక్కబెట్టే రోబోట్‌లు, డ్రోన్ల వినియోగం, ఇంటర్నెట్‌ ఆధారిత అప్లికేషన్ల ద్వారా దిగుబడులు పెంపొందించడంతోపాటు.. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలను రాబట్టే మెరుగైన మార్కెట్లను చేరుకోవడం.. వంటి ప్రతి దశలోనూ ఇంజనీరింగ్‌ ఆవిష్కరణల పాత్ర నానాటికీ పెరుగుతోంది.

వ్యవసాయ ఇంజనీరింగ్‌ వృత్తినిపుణుల ఆవిష్కరణలను అందుబాటులోకి తేవడం ద్వారా వ్యవసాయంలో సమస్యలను అధిగమించడం, ఉత్పాదకతను పెంపొందించడంపై ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌ దృష్టిని కేంద్రీకరిస్తోంది. ఐసీఏఆర్, ఇక్రిశాట్, నాబార్డ్‌ తదితర సంస్థల భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ అంతర్జాతీయ సమావేశం గురించి మరిన్ని వివరాలకు..  www.techcongress.net/ agri-tech
వెబ్‌సైట్‌ చూడండి.

మరిన్ని వార్తలు