శాశ్వత వ్యవసాయంపై జాతీయ సదస్సు

12 Jan, 2016 00:12 IST|Sakshi
శాశ్వత వ్యవసాయంపై జాతీయ సదస్సు

ప్రకృతి వ్యవస్థలకు అనుకూలంగా, స్థానిక వనరులను వినియోగించుకోవడం ద్వారా స్థానిక ప్రజలు అనుసరించే ఆరోగ్యదాయకమైన జీవన విధానమే ‘శాశ్వత వ్యవసాయ’ (పర్మాకల్చర్) పద్ధతికి మూలం. మనం అనుసరించే సాగు పద్ధతులు.. శాశ్వత ప్రయోజనాలను పరిరక్షించుకుంటూ కొనసాగాలన్న గాఢమైన చైతన్యాన్నందించే పర్మాకల్చర్ భావనకు ఆద్యుడు బిల్ మాలిసన్. మన దేశంలో, తెలుగునాట శాశ్వత వ్యవసాయ భావనకు ఊపిర్లూదిన వారు డా. వెంకట్. వారి శిష్య బృందంలో ముఖ్యులైన అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ వ్యవస్థాపకులు కొప్పుల నరసన్న ‘జాతీయ పర్మాకల్చర్ సదస్సు-2016’ను నిర్వహించ తలపెట్టారు.

హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం (రాజేంద్రనగర్)లో ఫిబ్రవరి 5 నుంచి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు సదస్సు జరుగుతుంది. పర్మాకల్చర్, సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ వ్యవస్థలపై ప్రసంగాలు, చర్చాగోష్ఠులు జరగనున్నాయి.  దేశీ విత్తనాల ప్రదర్శన, అమ్మకం కూడా ఉంటాయి. సుప్రసిద్ధ శాస్త్రవేత్త, దేశీ విత్తనోద్యమ నేత డా. వందనా శివ తదితరులు పాల్గొంటారు. ఆసక్తి గల వారు 040- 24142295, 85006 40590 నంబర్లలో అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ బాధ్యులను సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్లను చూడొచ్చు.
 www.permacultureindia.org www.npcindia2016.org

మరిన్ని వార్తలు