సాగు.. సాఫ్ట్‌వేర్‌... చెట్టపట్టాల్‌..!

11 Jul, 2017 00:53 IST|Sakshi
సాగు.. సాఫ్ట్‌వేర్‌... చెట్టపట్టాల్‌..!

పట్టణాల్లో కొద్ది పాటి స్థలం ఉన్నా కాంక్రీట్‌ కట్టడం వెలవాల్సిందే.  కానీ బెంగళూరులోని మాన్యతా బిజినెస్‌ పార్క్‌ మాత్రం దానికి భిన్నం. నోకియా, కాగ్నిజెంట్, ఐబీఎం వంటి పలు ఐటీ బహుళ జాతి కంపెనీలు ఉన్న ఈ ఆవరణలో 15 ఎకరాల్లో సేంద్రియ పంటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. 70 మంది ఉద్యోగులు సేంద్రియ మొక్కజొన్న, టమాటా, మిరప, బచ్చలికూర, కొత్తిమీర వంటి పంటలను పండిస్తున్నారు.

బిందుసేద్య పరికరాలను అమర్చినా ఉద్యోగులు మాత్రం మొక్కలకు తమ చేతులతో నీటిని పోసి ముచ్చటపడుతున్నారు. వేరు వేరు కంపెనీల్లో.. విభిన్న హోదాల్లో పనిచేసే ఉద్యోగులంతా ఒకరి కొకరు పంటల సాగులో సహాయం చేసుకుంటున్నారు. పనిఒత్తిడితో అలసిపోయే ఉద్యోగులకు ఆటవిడుపుగా ఈ పంటల సాగు ఉపయోగపడుతోంది. ఇక్కడ పండించిన çకూరగాయలనే తమ ఇంటి అవసరాలకు వాడుతున్నారు. రుచికరమైన ఆహారాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పంచుకుంటున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన కూరగాయల రుచి చూసిన రైతులు అచ్చెరువొందుతున్నారు.

మరిన్ని వార్తలు