ఇసుక దిబ్బల్లోనూ..!

13 Jul, 2015 23:56 IST|Sakshi
ఇసుక దిబ్బల్లోనూ..!

‘తివిరి ఇసుక నుంచి తైలం తీయవచ్చు..’ అంటారు. తైలం విషయం ఏమోగాని.. బంగ్లాదేశ్‌లో ఇసుక దిబ్బలు, వరదల కారణంగా ఇసుక మేట వేసిన పొలాల్లో చక్కని పంటలు పండిస్తున్నారు. భారీ టెక్నాలజీ, ఖరీదైన సదుపాయాల వంటివేమీ అక్కర్లేదు. ఎక్కువ కాలం నిల్వ ఉండే గుమ్మడి కాయలు పండిస్తే ఆహార భద్రతకు ఢోకా ఏముంది?

 1.    ఇసుకలో మీటరు లోతు, వైశాల్యం గల గుంత తవ్వాలి.
 2. ఒక గోనె సంచిని తీసుకొని కంపోస్టు లేదా ఘనజీవామృతం కలిపిన మట్టి మిశ్రమంతో నింపాలి. కొన్ని రోజుల తర్వాత దాన్ని ఇసుక గుంతలో బల్లపరుపుగా పెట్టాలి. కంపోస్టులో నాలుగు నుంచి ఆరు వరకు ఏవైనా విత్తనాలను విత్తుకోవాలి.
 3. ఆ తరువాత ఐదు నెలలు ఈ గోతులను జాగ్రత్తగా పర్యవేక్షించాలి. ప్రతి గుంత నుంచి ఫలసాయం లభిస్తుంది.
 

మరిన్ని వార్తలు