ఫుడ్ ఫర్ చేంజ్

5 Oct, 2014 03:35 IST|Sakshi
ఫుడ్ ఫర్ చేంజ్

మీరు తినే తిండి ఓ పేద విద్యార్థి జీవితాన్ని మార్చేస్తుంది. ఎలాగంటారా..! ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు ఆర్థిక భరోసానిచ్చేందుకు ‘ప్రాజెక్ట్ 511’ సంస్థ శ్రీకారం చుట్టింది. దానోత్సవ్‌లో భాగంగా ప్రముఖ హోటళ్ల సహకారంతో జూబ్లీహిల్స్ జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం ‘ఫుడ్ ఫర్ చేంజ్’ నిర్వహిస్తుంది. ఇందుకోసం నోవాటెల్, ఐటీసీ, ఆవాస, రాడిసన్, మారియట్ హోటళ్ల చెఫ్‌లందరూ కలిసి 16 రకాల భోజనాలు రెడీ చేస్తున్నారు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, మెడిటరేనియన్, ఏషియన్... ఇలా డిఫరెంట్ వంటకాల రుచులు వేడివేడిగా వడ్డించేందుకు సిద్ధమవుతున్నారు.

రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే విందులో ఈ ఐదు హోటళ్లు తమ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. నటి సమంత, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ సహా ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన వెయ్యి మందికి ఆహ్వానం పంపామని ఫుడ్ ఫర్ చేంజ్ కన్వీనర్ సుజిత్ తెలిపారు. దీనికి అందరూ ఆహ్వానితులేనని చెప్పారు. ఒకరికి చార్జి రూ.4,000. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన సొమ్మును ఏడాది పాటు పేద పిల్లల చదువుకు ఖర్చు చేస్తామన్నారు. టికెట్ కావల్సినవారు 9491100000 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.             
- సాక్షి, సిటీ ప్లస్

మరిన్ని వార్తలు