బిర్యానీ రెడీ.

4 Jun, 2014 22:26 IST|Sakshi
బిర్యానీ రెడీ

 రెండు కూరలు, పప్పు, పచ్చడి, అప్పడం, పెరుగుతో భోం చేస్తే షరా మామూలే! వారానికోసారైనా బిర్యానీ లాగించెయ్యడమే ఇప్పుడు నగరవాసుల కొత్త టేస్ట్. అదీ ఇంటిలో చేసింది కాదు.. బిర్యానీ పాయింట్‌కి వెళ్లి బిర్యానీ తినాల్సిందే. దీనికి అనుగుణంగానే నగరంలో భారీగా బిర్యానీ విక్రయ సెంటర్లు వెలిశాయి.  ర్యానీ పాయింట్.. ఇప్పుడు నగరంలో ఇదో పెద్ద వ్యాపారం. నగర ప్రజల అభిరుచికి అనుగుణంగా ఈ బిర్యానీ తయారీ సెంటర్లు వెలుస్తున్నాయి. రోజూవారీ అమ్మకాలు ఒక్కో పాయింట్‌లో రూ.25 వేల పైబడే జరుగుతున్నట్లు అంచనా.

కొందరు బిర్యానీ ప్రియులు నెలకు సుమారు రూ.వెయ్యిరూపాయలు బిర్యానీకే వెచ్చిస్తున్నారు. అదికూడా బాస్మతి బియ్యంతో చేసిన బిర్యానీకి ఎక్కువ డిమాండ్ ఉంది. బిర్యానీలో మటన్ దమ్, మటన్ ఫ్రై, చికెన్ దమ్, చికెన్ ఫ్రై, చికెన్ జాయింట్, చికెన్ బోన్‌లెస్ బిర్యాని, వెజ్ బిర్యాని రైస్ రకాలు లభిస్తున్నాయి. నగరంలో మద్రాస్ బిలాల్, వైస్రాయ్, న్యూ బావాచి, మౌర్యా, బాబు బిర్యాని పాయింట్, అజ్మీర్ మహరాజ్ తదితర పాయింట్లలో బిర్యాని లభిస్తోంది. వీటితోపాటు పెద్ద రెస్టారెంట్లలో కూడా పలు రకాల బిర్యానీలు లభిస్తున్నాయి. ఆర్డర్లపై బిర్యానీల సప్లయి..
 
 వివాహాది, శుభకార్యాలకు బిర్యానీలు సప్లయి చేసేందుకు బిర్యానీ పాయింట్లు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసుకున్నాయి. బిర్యానీ ధరలు రూ.100 నుంచి రూ.300 వరకు ఉన్నాయి. హోటళ్లలో మామూలు భోజనం ధర దాదాపు రూ.70 నుంచి రూ.80 వరకు ఉంది. దీంతో రూ.100 పెట్టి బిర్యానీ తినేందుకు చాలామంది వెనుకాడడం లేదు. కొన్ని హోటళ్లలో తిన్నంత బిర్యానీ అందిస్తున్నారు. బిర్యానీ పార్సిల్‌కు కూడా వినియోగదారుల నుంచి మంచి ఆదరణ ఉంది.
 
 నాలుగేళ్లుగా బిర్యానీ చేస్తున్నా..
 
 మా స్వస్థలం చెన్నై. నాలుగేళ్లుగా నేను బిర్యానీ చేస్తున్నాయి. నాతోపాటు హోటల్‌లో నలుగురు నిష్ణాతులైన బిర్యానీ మాస్టర్లు ఉన్నారు. నేతితో తయారుచేసిన బిర్యానీకి డిమాండ్ ఉంది. బిర్యానీని బాసుమతి బియ్యంతో తయారు చేస్తే ఆ రుచి మరింతగా బాగుంటుంది.

మూడేళ్లుగా..


 మూడేళ్లుగా బిర్యానీ అమ్మకాలను కొనసాగిస్తున్నాం. రుచికరమైన బిర్యానీని వినియోగదారులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాం. నగరంలో రోజురోజుకీ బిర్యానీ విక్రయించే పాయింట్లు పెరుగుతున్నాయి.
 - నసీర్, అజ్మీర్ మహారాజ్ బిర్యానీ పాయింట్
 
 కస్టమర్లు ఆదరిస్తారు..
 నాలుగేళ్లనుంచి బిర్యానీ అమ్మకాలు ప్రారంభించాం. నాణ్యతతో కూడిన నేతి బిర్యానీని అందిస్తే కస్టమర్లు ఆదరిస్తారని గట్టిగా నమ్ముతున్నాం.
 -మహ్మద్, బిర్యానీ మాస్టర్,  హోటల్ బాబు బిర్యాని పాయింట్
 
 

మరిన్ని వార్తలు