మహారుచి

26 Jun, 2014 03:00 IST|Sakshi
మహారుచి

అభిరుచి ఉండాలే గానీ...  రుచికి కొదవే లేదు భాగ్యనగరిలో.  కాశ్మీర్ టు కన్యాకువూరి...  ఏ టేస్టరుునా ఇక్కడ రెడీ. గజి‘బిజీ’ లైఫ్‌స్టైల్‌లో వారానికోరోజే దొరికే హాలిడే... ఎప్పుడూ అదే ‘పాత చింతకాయ పచ్చడేనా’! కాస్త రిలాక్స్‌గా  కూర్చుని... ఇంకాస్త కొత్తగా ఏదైనా వంటకాన్ని  ట్రై చేస్తే..! వాహ్... వీకెండ్‌లో భలే  జా కదూ!  రండి... మీ కోసమే ఈ రుచులన్నీ...
 
 హాట్.. హాట్ పరాటా

 విభిన్నమైన పరాటాలను పసందుగా అందించే ఫెస్ట్ ఇది. సికింద్రాబాద్ హోటల్ మెహిఫిల్‌లో ఏర్పాటు చేసిన ఈ ఆహారోత్సవంలో వులబారీ, లచేదార్, వార్ఖీ,కచ్చిమిర్చి, మేథీ, లెహసూని, స్టఫ్‌డ్ పరాటాలు నగరవాసులను రారవ్ముని ఆహ్వానిస్తున్నారుు.
 
  బటాటా వడ
 నెక్లెస్‌రోడ్డు నుంచి నయా రుచులు నగరవాసిని రారామ్మని పిలుస్తున్నాయి...బాల్‌ఠాకరేలోని ఆవేశమంత స్పైసీగా... ముంబై మోడల్ అంత స్వీట్‌గా.. సచిన్ స్ట్రెట్ డ్రైవ్ అంత క్లాసిక్‌గా ఉండే ఆ వంటలను రుచిచూస్తే ఎవరైనా సరే వహ్వా అనాల్సిందే.. అందుకే రుచుల పంట పండిస్తున్న ఆ మరాఠీ వంటకాలకు హైదరాబాదీ కూడా ఆదాబ్ అంటున్నాడు.. పావేబాజీకి నోరందిస్తున్నాడు... వడాపావ్‌కు చేయి అందిస్తున్నాడు.. టోటల్‌గా ‘మహా’రుచులను తింటూ మన న గరవాసి మైమరచిపోతున్నాడు. కాస్త కారంగా... కొంచెం ఘాటుగా... కనులకింపుగా... భిన్నరుచులతో అదరగొట్టే మహారాష్ట్ర సంప్రదాయ ఫుడ్ ఫెస్టివల్ నెక్లెస్‌రోడ్డులోని ‘ఓరిస్’లో ప్రారంభమైంది. ఈ నెల 20న మొదలైన ఈ రుచుల విందు మరో 10 రోజులుంటుంది. మామిడి పండ్లను రొయ్యలతో మిక్స్ చేసి తయారు చేసే మచ్చికల్వాన్, బటాటా, మచ్చి కల్వాణ్, కందపోహా, సుబుదానా వడ, రతలు కిస్సీ, గర్వంగ్ మటన్, మట్కీ ఉసాక్, టోండ్లీ భాజీ మటన్ వడ్వాల్, మటన్ కొల్హాపూరి, మటన్ అగ్రి, వడపావ్, పావ్‌బాజీల గురించి ప్రత్యేక ంగా చెప్పాల్సిన అవరసమే లేదు.
 
 మహిమ
 వంటలే కాదు.. క్రీమీస్టోన్‌లో వెరైటీ ఐస్‌క్రీములు లభిస్తాయి. మాన్‌సూన్ స్పెషల్‌గా ఇక్కడ తయారుచేసే కాలాజామూన్ అందరి నోళ్లలో నానుతోంది. నేరేడు పండ్లు, వెనీలా ఐస్‌క్రీమ్‌ను జామ్నా ఐస్‌తో కలిపి దీన్ని తయారు చేస్తారు. ఈ ఐస్‌క్రీమ్ తింటే రక్తశుద్ధికి బాగా ఉపయోగపడుతుందని క్రీమీస్టోన్ అపరేషనల్ మేనేజర్ ఫ్రాంక్లిన్ అంటున్నారు. కుల్ఫీ రీమిక్స్, అల్ఫోన్సో మ్యాంగో, మస్క్ మెలన్ లాంటి వెరైటీ ఐస్‌క్రీమ్‌లు కూడా లభిస్తున్నాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా డ్రింక్ క్రీమ్‌ను కూడా తయారు చేశారు.

  వడపావ్
 మహారాష్ట్ర వంటకాల్లో ఎక్కువగా వేరుశనగ, నువ్వులు, ఎండు మిరపకాయలు, మసాలా, ఇంగువ వాడతారు. అలాగే చేపల కర్రీలో వెల్లుల్లి ఎక్కువగా వాడతాం. దీనివల్ల ఎసిడిటీ రాకుండా నివారించవచ్చు.
 - ఎం.ఎస్.నీలేశ్‌కుమార్, ఓరిస్ ఎగ్జిక్యూటివ్  చెఫ్

మరిన్ని వార్తలు