రోడ్డు ప్రమాదంలో ఎన్‌ఆర్‌ఐ కుటుంబానికి గాయాలు

23 May, 2017 10:00 IST|Sakshi
రోడ్డు ప్రమాదంలో ఎన్‌ఆర్‌ఐ కుటుంబానికి గాయాలు

అలబామా: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎన్‌ఆర్‌ఐ కుటుంబం తీవ్రంగా గాయపడింది. సోమవారం సాయంత్రం అలబామాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన దంపతులు శరవణన్‌, వెనిలాతో పాటు వారి కూతురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన శరవణన్‌తో పాటు కూతురు అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం.

కాగా.. ఎన్‌ఆర్‌ఐ కుటుంబం ప్రమాదానికి గురైన విషయం తెలిసిన వెంటనే అమెరికా తెలుగు అసొసియేషన్‌(ఆటా) సభ్యులు వేగంగా స్పందించారు. తొలుత బాధితులకు గాడ్స్‌డెన్‌ మెడికల్‌ సెంటర్‌లో చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం తీవ్రంగా గాయపడిన శరవణన్‌, ఆయన కూతుర్ని యూఏబీ ట్రామా సెంటర్‌కు తరలించి మెరుగైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. ఆటా సేవా సభ్యులు సుధీర్‌, బోదిరెడ్డి అనిల్‌, దొంతి సతీష్‌, శివ రామడుగు, శంకర్‌ తదితరులు రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచి వారి కుటుంబ సభ‍్యుల్లో మనోస్థైర్యం నింపారు.

మరిన్ని వార్తలు