-

నిస్తేజం మీద ఒక విస్ఫోటనం

25 Mar, 2017 01:51 IST|Sakshi
నిస్తేజం మీద ఒక విస్ఫోటనం

భారత స్వాతంత్య్రోద్యమ సాధనలో జాతీయ కాంగ్రెస్‌ తన వంతు కృషి చేసింది. కానీ, దాస్య శృంఖలాలు తెగడానికి ఆ సంస్థ ఒక్కటే కారణం కాదు. మైదాన ప్రాంతాలలో జరిగిన రహస్యోద్యమాలు, తీవ్ర జాతీయ వాదుల త్యాగాలు, విదేశాలలో ఉండి తీవ్ర జాతీయ వాద పంథాను అనుసరించినవారి కృషి, రైతాంగ పోరాటాలు, గిరిజనోద్యమాలు స్వేచ్ఛకు దోహదపడి నవే. దేశ స్వాతంత్య్ర సాధనకు ఉన్న ఈ నేపథ్యాన్ని సమగ్రంగా దర్శించే అవకాశం ఇక్కడ నేటి వరకు కల్పించలేదు. అందుకే వాసుదేవ్‌ బల్వంత్‌ ఫాడ్కే, 1857 ప్రథమ స్వాతంత్య్ర వీరుల చరిత్ర, బిర్సా ముండా, అల్లూరి శ్రీరామరాజు, భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు త్రయం, చంద్రశేఖర్‌ ఆజాద్, గదర్‌ వీరులు, ఖుదీరామ్‌ బోస్, సుభాశ్‌ చంద్రబోస్, చిట్టగాంగ్‌ వీరులు ఇలా ఎందరివో చరిత్రలు చీకటిలోనే ఉండి పోయాయి. ఇది భారతదేశ చరిత్ర రచనకు సంబంధించి జరిగిన గొప్ప ద్రోహం. ఈ మహా తప్పిదాన్ని సవరించి, చరిత్ర రచనలో త్యాగధన్యతకు సరైన స్థానం కల్పించ డానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇటీవల ప్రముఖ పత్రికా రచయిత ఎంవీఆర్‌ శాస్త్రి రాసిన ‘భగత్‌ సింగ్‌’ అలాంటి ప్రయత్నమే. 289 పేజీల ఈ పుస్తకంలో 47 చిన్న చిన్న అధ్యాయాలు ఉన్నాయి. చారిత్రకాధారా లను ఉటంకిస్తూనే ఉద్వేగంగా రచనను సాగించడం శాస్త్రి ప్రత్యేకత.
మొదటి ప్రపంచ యుద్ధం తరువాత భారతదేశ సజీవ శరీరంలో బ్రిటిష్‌ సామ్రాజ్యపు గోళ్లు మరింత లోతుగా దిగడం మొదలయింది. ఆ క్రమంలో జరిగిన తొలి అకృత్యమే జలి యన్‌వాలాబాగ్‌ దురంతం. భగత్‌సింగ్‌ ప్రాపంచిక దృష్టికి అక్కడే బీజం పడింది. కుటుంబ నేపథ్యం, పంజాబ్‌ సామాజిక దృశ్యం, గాంధీజీ అహింసా సిద్ధాంతం ఆయనను విప్లవ పంథాలోకి నడిపించాయి. ఈ అంశాలనే రచయిత తనదైన శైలిలో వివరించారు.

ఈ పుస్తకంలో భగత్‌సింగ్‌ పట్ల గాంధీ వైఖరి ఏమిటి? అనే అంశం మీద గట్టి చర్చకు ఆస్కారం కల్పించే ప్రయత్నం జరిగింది. భగత్‌సింగ్‌కు పడిన మరణదండనను తప్పించాలని యావత్‌ భారతజాతి ముక్తకంఠంతో నినదిస్తే, ఆ జనాభిప్రాయాన్ని గాంధీజీ దగా చేశారన్న అభిప్రాయాన్ని రచయిత పూర్తిగా సమ ర్థించారు. అందుకు బలమైన ఆధారాలను కూడా ఉటం కించారు. ముందుగా నిర్ణయించినట్టుగా కాక, పద కొండు గంటలకు ముందే, 1931, మార్చి 23 రాత్రి ఏడు గంటలకు ఆ యువత్రయాన్ని ఉరితీశారు. ఇందుకు కారణం– ఆ యువ కిశోరాల ఉరితీతతో చెలరేగే అలజడి జాతీయ కాంగ్రెస్‌ సభలకు అడ్డుకాకూడదని గాంధీజీ కోరుకున్నారని కూడా ఆధారాలు లభ్యమవుతున్నాయి. అవి కూడా ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఆనాడు తీవ్రవాదం కూడా ఒక ఉద్యమ స్రవంతే. అయినా అది ఆత్మ లేనిది కాదు. శత్రువును బట్టి దాని పంథా ఉంటుంది. ఇదే భగత్‌సింగ్‌ జీవితం, ఆ కాలం చెబుతాయి. దీని నుంచి వర్తమాన ప్రపంచం నేర్చు కోవాలి.

పార్లమెంట్‌లో బాంబు విసిరిన తరువాత ఇచ్చిన వివరణలో భగత్‌సింగ్, ‘చెవిటివారికి వినపడా లంటే గట్టిగా మాట్లాడాలి’ అని. అంటే ఎవరినీ చంప డం భగత్‌సింగ్, ఆయన వెంట ఉన్న బటుకేశ్వర్‌దత్‌ల ఉద్దేశం కాదని సుస్పష్టం. కానీ లాలా లాజపతిరాయ్‌ అనే మహనీయుడి చావుకు కారణమైన వారిలో ఒకడు సాండర్స్‌ను (స్కాట్‌ అనే మరో తెల్ల దురహంకారిని చంపబోయి) భగత్‌సింగ్‌ సుఖదేవ్‌తో కలసి చంపాడు. భగత్‌సింగ్‌ జీవితంలో ఈ ముఖ్య ఘట్టాలతో పాటు, ఆయన బాల్యం, అప్పటికి ఐదారు దశాబ్దాలుగా ఆ కుటుంబం దేశం పట్ల నెరవేర్చిన బాధ్య తలను గురించి, జలియన్‌వాలా బాగ్‌ రక్తపాతం, సైమన్‌ కమిషన్‌ వ్యతి రేకోద్యమం వంటివి రచయిత ఉద్వేగ భరితంగా చిత్రిం చారు. ఎంవీఆర్‌ శాస్త్రి రచించిన ఈ తాజా పుస్తకం ఆ మహనీయుడి జీవిత గాథ పట్ల ఈ తరం మరింత అవగాహన పెంచుకోవడానికి నిస్సందేహంగా ఉపక స్తుంది. ఇదే క్రమంలో, ఇదే స్ఫూర్తితో ఇలాంటి పుస్త కాలు శాస్త్రిగారి కలం నుంచి, ఇతర చరిత్రకారుల రచ నల నుంచి వెలువడాలని ఆశిద్దాం.

ప్రతులకు: దుర్గా పబ్లికేషన్స్, జి–1, సాయికృష్ణ మేన్షన్, 1–1– 230/9, వివేక్‌ నగర్, చిక్కడ పల్లి, హైదరాబాద్‌–20 ‘ మొబైల్‌: 94412 57961/62
– సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు