ఫూలేకు భారతరత్న ఇవ్వాలి

3 Aug, 2016 23:55 IST|Sakshi
ఫూలేకు భారతరత్న ఇవ్వాలి

1857 నాటి ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి  ముందే సామాజిక న్యాయం గురించి గళమెత్తినవారు మహాత్మా జ్యోతిభా ఫూలే (1827-1890). అట్టడుగు వర్గాల ఆర్తనాదాలను విని వారి విముక్తి కోసం సామాజిక ఉద్యమాన్ని తీసుకువచ్చిన భారతదేశ తొలి సామాజిక విప్లవకారుడు ఫూలే. బ్రాహ్మణీయ  భావజాలాన్ని వ్యతిరేకించాడు. శూద్రులు, మహిళల కోసం పాఠశాలలు తెరిచాడు. అవే దేశంలో అట్టడుగు వర్గాలకు తొలి పాఠశాలలు. ఆయన జీవిత భాగస్వామి సావిత్రి ఫూలే భారతదేశ తొలి మహిళా టీచర్. 63 ఏళ్ల జీవితంలోనే ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన దారిలోనే అంబేడ్కర్ ఆత్మగౌరవ బీజాలు నాటుతూ భారత రాజ్యాంగాన్ని రచించారు. అలాంటి వ్యక్తికి ‘భారతరత్న’ ఇప్పటికే ఇవ్వవలసింది. ఫూలేకు భారతరత్న ఇవ్వాలని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ ఈ ఏడాది మే 6వ తేదీన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిని కేంద్ర హోంశాఖ ప్రధాని కార్యాలయానికి పంపించింది. వినోద్ చేసిన కృషితో ఫూలేకు భారతరత్న ఇవ్వాలన్న ఆలోచనకు కదలిక రావడాన్ని తెలుగు సమాజం, దేశంలోని అట్టడుగు దళిత బహుజన వర్గాలు హర్షిస్తున్నాయి. కేంద్రం ముందుకు వచ్చి ఫూలేకు భారతరత్న ఇస్తే దేశ ప్రతిష్టకు  వన్నెతెచ్చినట్టవుతుంది.  
 
కె. కేశవరావు (రాజ్యసభ సభ్యుడు), అల్లం నారాయణ (ప్రెస్ అకాడమీ చైర్మన్), చుక్కా రామయ్య (ప్రముఖ విద్యావేత్త), ఆర్. కృష్ణయ్య (బి.సి. సంఘాల జాతీయ అధ్యక్షులు, శాసనసభ్యులు), కె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి సంపాదకులు), కట్టా శేఖర్‌రెడ్డి (నమస్తే తెలంగాణ సంపాదకులు), ఎస్. వీరయ్య (నవ తెలంగాణ సంపాదకులు), కె. శ్రీనివాసరెడ్డి (మన తెలంగాణ సంపాదకులు), వినయ్ కుమార్(ప్రజాశక్తి  మాజీ సంపాదకులు), వై.ఎస్.ఆర్. శర్మ, సతీష్‌చందర్ (ఆంధ్రప్రభ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  దినపత్రిక సంపాదకులు), జి. శ్రీరామమూర్తి (సీనియర్ జర్నలిస్టు),
 ఉ.సాంబశివరావు, (బహుజన ఉద్యమాల ఉపాధ్యా యుడు), నారదాసు లక్ష్మణరావు (శాసనమండలి సభ్యులు), మల్లెపల్లి లక్ష్మయ్య (దళిత స్టడీ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షులు), గోరటి వెంకన్న (ప్రముఖ కవి), జి.లక్ష్మీనర్సయ్య (సాహిత్య విమర్శకులు), ప్రొ.జయధీర్ తిర్మల్‌రావు, నాళేశ్వరం శంకరం (కవి, రచయిత), జూపాక సుభద్ర (కవి, కథా రచయిత్రి), స్కైబాబా (కవి), జూపాక సుభద్ర (రచయిత్రి), డా. ఎస్. రఘు (అసిస్టెంటు ప్రొఫెసర్, ఉస్మానియా).             

( వ్యాసకర్త :   జూలూరు గౌరీశంకర్ అధ్యక్షులు, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ )

మరిన్ని వార్తలు