మత్తులో జోగుతున్న పంజాబ్

1 May, 2016 04:18 IST|Sakshi
మత్తులో జోగుతున్న పంజాబ్

ఇప్పుడు మత్తుపదార్థాలు పంజాబ్‌లో ఆరోనదిలా ప్రవహిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. కొన్ని కుటుంబాలే ఈ మహమ్మారి బారిన పడి ఉన్నా యని తేలింది. ఒక యువ వ్యాపారవేత్త అలవాటు కొద్దీ హెరాయిన్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. తరువాత తెలిసిందేమిటంటే, అతడి భార్య, సోదరి కూడా దానికి అలవాటు పడిపోయారు. అతడికి తెలియకుండా ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు.

ఫరీద్‌కోట జిల్లాలో అయితే అబ్బాయిలు, వాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్ ఇద్దరూ హెరాయిన్‌కు బానిసలు కావడం సర్వసాధారణమైపోయిందని గురు గోవింద్‌సింగ్ వైద్యకళాశాల ఆచార్యుడు డాక్టర్ అరవింద్‌శర్మ చెప్పారు. లూధియానాకి చెందిన ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ అజయ్‌పాల్ సాంధు చెప్పిన వివరాలు మరీ ఆందోళనకరంగా ఉన్నాయి. ఆయన ఇంతవరకు రెండువేల కేసులను నయం చేశాడట. అందులో ప్రతి వందకు 30 కేసులు భార్యాభర్తలకు కలిపి వైద్యం చేసినవేనని చెప్పారు.

మరిన్ని వార్తలు