మన నట్టింట్లో డ్రగ్స్‌ భూతం

20 Jul, 2017 02:53 IST|Sakshi
మన నట్టింట్లో డ్రగ్స్‌ భూతం

సందర్భం

మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్రంగా ఉందని నిఘా సంస్థలు ఆధారాలతో సహా హెచ్చరిస్తున్నాయి. పెనువాయువును మించిన వేగంతో విస్తరిస్తున్న డ్రగ్స్‌ను అరికట్టకపోతే భవిష్యత్తుకే ప్రమాదం.

ఏ దేశాభివృద్ధి అయినా సరే కుంటుపడిపోవడం, ఒక్కసారిగా వినాశనమవడం లాంటి పెను విపత్తులకు పెద్ద పెద్ద యుద్ధాలు, ఆణ్వాయుధాలే కారణమవ్వాల నేంలేదు. ఆ దేశంలోని తరగతి గదుల్లో అమలవుతున్న విద్యలో విలువలు లేకపోతే చాలు.. యావజ్జాతి తుడిచిపెట్టుకుపో తుంది. అంధకారంలో మగ్గిపోతుంది. డ్రగ్స్‌ వల్ల ఇప్పటికే పంజాబ్‌ రాష్ట్రం ఎంతో నష్టపోయింది. ఎంతో దృఢకాయు     లుగా పేరున్న పంజాబీలు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల తమ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చుకున్నారు. ఆ రాష్ట్ర యువతపై గతంలో కొన్ని శాంపిల్స్‌ తీసి పరీక్షిస్తే 74 శాతం  మాదక ద్రవ్యాలకు వ్యసనపరులుగా మారిపోయారని నివే దిక వచ్చిందంటే ఆ రాష్ట్రం ఎంతటి భారీ విపత్తును ఎదు ర్కొన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉందని నిఘా వర్గాలు తేల్చి చెప్పడం ఎంతో ఆందోళన కలిగించే అంశం.

కలవరపెట్టే విషయం: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్‌ సమస్య తీవ్రంగా ఉండటం మరింత కలవర పెడుతోంది మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్రంగా ఉందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సంపన్న వర్గాల్లోని యువత మత్తు పదార్థాలకు బానిసలవుతున్న విషయాన్ని అవి ఎత్తి చూపుతున్నాయి. విద్యాసంస్థలే లక్ష్యంగా మత్తు పదార్థాల సరఫరా జరుగుతోందని అబ్కారీ శాఖ చెబుతోంది. ఇప్ప టికే 5 వేల మంది విద్యార్థులు డ్రగ్స్‌ బారిన పడినట్లుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మత్తు పదార్థాల వినియో గం అనే అతిపెద్ద ఉపద్రవం నుంచి యువతను తక్షణమే బయటపడేయాలి.

సంపన్నవరాలు ఆయాచితంగా వస్తున్న సంపాదన నుంచి బయటకు వచ్చి వారి పిల్లల గురించి ఆలోచించాలి.  పిల్లల స్థితిగతులను గుర్తించి త్వరగా∙దారిలో పెట్టలేక పోతే వారెంత సంపాదించినా వృథానే. చివరికి మిగిలేది శూన్యమే. విద్యార్థి ఎన్ని మార్కులు సాధించినా.. వాటిని ఉటంకిస్తూ ఎన్ని ప్రకటనలు ఇచ్చుకున్నా.. విలువలు లేని చదువు యువత భవిష్యత్తును ఆదర్శంగా తీర్చిదిద్దలేదనే విషయాన్ని విద్యాసంస్థలు గమనంలో ఉంచుకోవాలి. పదుల వయసులోనే మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం అనేది తీవ్రమైన సమస్య. ఇది పెనువాయువును మించిన వేగంతో విస్తరిస్తుంది. ‘మత్తు’ను అరికట్టాలంటే అన్ని వైపుల నుంచి తక్షణమే ప్రయత్నాలు మొదలవ్వాలి. లేదంటే దేశ భద్రతకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది.

ప్రభుత్వాలు ఏం చేయాలి? : 1.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్‌ బృందాల ద్వారా నింది తులను గుర్తించి కేసులు పెడుతోంది. తక్షణమే ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం కూడా నిఘా వ్యవస్థలను రంగంలోకి దించాలి. 2.ప్రతి విద్యాసంస్థ నుంచి కొందరు అధ్యాపకు లను గుర్తించి, వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాలి. మత్తు బారిన పడిన విద్యార్థులను గుర్తించడం ఎలా..? బాధిత విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇలా ఇవ్వాలి లాంటి అంశాలపై ఎంపిక చేసిన అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలి. 3. కళాశాల స్థాయిలోనే డ్రగ్స్‌ వినియోగంపై ఉక్కుపాదం మోపేలా ఒక చట్టాన్ని రూపొందించి, కట్టుదిట్టంగా అమలుచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి. 4. రెండు రాష్ట్రాల్లోనూ కళా శాలలకు సమీపంలో ఉన్న దుకాణాల యజమానులపై నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగాలి. 5. పొగ తాగడమనే దురలవాటును మన యువతకు దూరం చేయగలుగు తున్నాం.. ఇలాంటి అవగాహన కార్యక్రమాలను డ్రగ్స్‌ విషయంలోనూ చేపట్టాలి.

తల్లిదండ్రులు ఏం చేయాలి?: 1.తల్లి దండ్రులు తమ పిల్లలను ఒక సంస్థలో చేర్చేప్పుడు.. చదు వుతోపాటు ఆ సంస్థ కనీస విలువలు పాటిస్తున్నదో లేదో చూసుకోవాలి. 2.ధనవంతుల పిల్లలు చేరే కళాశాలలు, పాఠశాలల్లోనూ తమ పిల్లలను కూడా చేర్చాలనే భావన నుంచి బయటకు రావాలి. 3. తమతమ వ్యాపకాల్లో ఎంత బిజీగా ఉన్నా.. తల్లిదండ్రులు పిల్లల కోసం సమయాన్ని కేటాయించాల్సిందే. 4.ఇప్పటికే ఇంట్లో పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటుపడి ఉంటే.. వారిని బంధించడం, అసహ్యిం చుకోవడంలాంటివి చేయొద్దు. సమస్యను గుర్తించి వారికి భరోసా ఇవ్వాలి. 5.మత్తు పదార్థాలకు బానిసలవడమనే సమస్య తీవ్రంగా ఉన్న పిల్లలను తల్లిదండ్రులు మానసిక వైద్యుల వద్దకు, డ్రగ్‌ అడిక్షన్‌ కేంద్రాల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పించాలి.

విద్యాసంస్థలు ఏం చేయాలి..?: 1.విద్యాసంస్థలు మంచి మార్కులు వచ్చేలా చేయడం, జ్ఞానాన్ని ఇవ్వడం మాత్రమే తమ బాధ్యతగా భావించరాదు. 2. ప్రతి ఉపా ధ్యాయుడు, చదువుతోపాటు తరగతి గదుల్లో కనీసం 5 నుంచి 10 నిమిషాల సమయాన్ని నైతిక విలువల గురించి విద్యార్థులకు చెప్పాలి. 3.విద్యాసంస్థలు ఒత్తిడిలో ఉన్న విద్యార్థులను గుర్తించి వారి సమస్యను తెలుసుకోవాలి. పరిష్కార మార్గాన్ని కూడా చూపాలి. 4 తరచూ ప్రతిభా వంతులైన సైకాలజిస్టులతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉండాలి. 5. విద్యార్థుల ఆలోచనలు ఎప్పుడూ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే దాని చుట్టూనే తిరు గుతుండేలా చేయాలి.

మనకున్న ఆస్తిపాస్తులు ఇళ్లు, పొలాలు కాదు.. మన పిల్లల సచ్ఛీలత, వారు నేర్చుకున్న నైతిక విలువలు, జీవి తంలో వారు పాటిస్తున్న క్రమశిక్షణ.. ఇవే మన నిజమైన ఆస్తులు. ఈ సంపాదన కోసం అంతా కృషి చేయాలి. తల్లి దండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, సమాజం.. ఇలా అంతా కలసికట్టుగా పనిచేస్తేనే ఇది సాధ్యం. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా విశేష ప్రచారం కల్పించాలి. అప్పుడు మన భవిష్యత్తు తరాలను, మన దేశాన్ని మనం కాపాడుకున్నవారమవుతాం. వ్యాసకర్త విద్యావేత్త, విజ్ఞాన్‌ విద్యా సంస్థల అధినేత

 

 


డాక్టర్‌ లావు రత్తయ్య

మరిన్ని వార్తలు