వారసత్వానికి మోదీ పాతర!

16 Mar, 2017 01:04 IST|Sakshi
వారసత్వానికి మోదీ పాతర!

సందర్భం
ఇప్పుడు నరేంద్ర మోదీ అంటే ఓట్లను రాబట్టే సామర్థ్యం అనే బ్రహ్మాస్త్రాన్ని కలిగి ఉన్న మాస్‌ మహరాజా. మరోలా చెప్పాలంటే ఉత్సవ విగ్రహాలను నిలబెట్టినా సరే గెలిపించుకువచ్చే ప్రభావ శక్తి ఇప్పుడు ప్రధాని సొంతం.

ఇప్పుడు భారత రాజకీయాల్లో సరికొత్త విరాణ్మూర్తి నరేంద్ర మోదీ. ఇక్కడ ప్రశ్న 2019 ఎన్నికల్లో గెలుపునకు పరిమితం కాదు.. తన సరికొత్త కీర్తితో మోదీ ఏం చేయనున్నారన్నదే ప్రశ్న. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ‘టెక్టానిక్‌ షిప్ట్‌’ అనే పదబంధంతో వర్ణించారు. భూ ఉపరి తలంలోని ఫలకాలు ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకు పోవడమే టెక్టానిక్‌ షిఫ్ట్‌. అత్యవసర పరిస్థితి అనంతరం జనతా పార్టీ ప్రభంజనం నాటి నుంచి మరెవరికీ సాధ్యం కానంత ఘన విజయం మోదీ సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ పది కంటే తక్కువ స్థానాలకు పరిమితమైపోయింది. ఇక ఉత్తరాఖండ్‌ను ఊడ్చేసిన బీజేపీ ఇంతవరకు ఉనికే లేని మణిపూర్‌లో నిజమైన రాజకీయ శక్తిగా మారింది.

అయితే, భారత ప్రాదేశిక రాజకీయాలనే కాకుండా దేశ సామాజిక, మానసిక, భావజాల రంగాలను కూడా పునర్నిర్మిస్తున్న ఈ అధికార మార్పిడిని టెక్టానిక్‌ మార్పు తో పోల్చడం మరీ తేలికగా ఉందని నా అభి ప్రాయం. ఈ మార్పునకు చెందిన అతిపెద్ద తొలి సంకేతం ఏదంటే ఇందిరాగాంధీ తర్వాత అత్యంత జనాకర్షణ గల భార తీయ నేతగా నరేంద్ర మోదీ ఆవిర్భవించారు. అది కూడా వారసత్వంపై కాకుండా తన సొంత ప్రయత్నంతో దీన్ని సాధించారు. రెండోది.. ఇందిరా గాంధీ అనంతరం  ఏ భారతీయ నేతా సాధించని అజమాయిషీని అధికార  పార్టీపై మోదీ దఖలుపర్చుకున్నారు. మోదీతోపాటు ఎన్ని కల రణరం గంలో సంపూర్ణ విజయాలను సాధిస్తున్న ఫీల్డ్‌ మార్షల్‌ అమిత్‌ షా కూడా 1960లనాటి కామరాజ్‌ నాడార్‌ తర్వాత జాతీయ స్థాయి పార్టీకి అత్యంత శక్తిమంతమైన అధినేతగా ముందు కొచ్చారు.

స్వాతంత్య్రానంతరం దేశ ప్రధాన కేంద్రానికి వెలు పల నుంచి వచ్చి అంతటి జాతీయ ఉన్నతిని పొందిన తొలి నేత కూడా మోదీనే. బయటి ప్రాంతం నుంచి వచ్చి దేశవ్యాప్త ప్రాచుర్యం పొందిన మరో నేత మహాత్మా గాంధీ మాత్రమే అని నేనంటే తప్పుగా భావించే ప్రమా దం ఉంది కానీ, గాంధీ కూడా గుజరాత్‌ నుంచే వచ్చాడ న్నది మినహా ఇరువురికీ పోలికలు పెట్టలేం. మోదీతో విభే దించేవారు సైతం అతని సమగ్ర వ్యక్తిత్వాన్ని శంకించ లేరు. అందుకే పెద్దనోట్ల రద్దుతో తీవ్రంగా ఇబ్బంది పడినా ప్రజలు మోదీని క్షమించారంటే ఇదే కారణం.

ఆర్థిక సంస్కరణ, సామాజిక సందేశం వంటి అంశాల్లో ప్రధానిగా మోదీ తొలిదశ పాలన రికార్డు అతు కుల బొంతలాగే ఉందని మోదీకి అత్యంత విశ్వాస పాత్రు లైన సమర్థకులు కూడా గుర్తిస్తున్నారు. కానీ గుజరాత్‌లో ఆయన పాలనా చరిత్రను మనం తెలుసుకోవాలని, మోదీ రెండోదశ పాలనకోసం వేచి ఉండాలని వీరంటున్నారు. సీఎంగా తొలి పాలనాకాలంలో మోదీ తన విభజన రాజ  కీయాలతో తీవ్ర ఘర్షణాత్మక వైఖరిని పాటించేవారు. రెండో దశ పాలనలో ఆర్థిక, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించి జాతీయ రాజకీయాధికార సాధనకు ఒక బలమైన పునాదినే నిర్మించుకున్నారు. ఇప్పుడు మోదీ అంటే ఓట్లను రాబట్టే సామర్థ్యం అనే బ్రహ్మాస్త్రాన్ని కలిగి ఉన్న మాస్‌ మహరాజా. మరోలా చెప్పాలంటే ఉత్సవ విగ్రహాలను నిలబెట్టినా సరే గెలిపించుకు వచ్చే సామర్థ్యం ఇప్పుడు మోదీ సొంతం.

తన అధికారాన్ని మోదీ ఇకపై ఎలా ఉపయోగిస్తార న్నదే ఇప్పుడు ప్రశ్న. 2007లో గుజరాత్‌లో చేసినట్లే.. ఎన్నికల్లో అడ్డు వచ్చే ఎవరినైనా నిర్మూలించడం నుంచి తప్పుకుని ఇకపై ప్రధాని ఆర్థిక మార్పుపై దృష్టి పెడ తారా? నిజంగానే అలాంటి అవకాశం ఇప్పుడు మోదీకి దక్కింది. ఇక కాంగ్రెస్‌ విషయానికి వస్తే దాని తొలి కుటుంబంలాగా ఓట్లు సాధించే రోజులు పోయాయి. 2004లో సాధించిన అనూహ్య విజయం.. అలాంటి రోజులు వచ్చాయన్న భ్రమలను మళ్లీ రెకెత్తించింది కానీ, ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. రెండోది. రాహుల్‌ గాంధీ ప్రజానేత కారు. మహా అంటే ఆయన పార్టీని కలిసి కట్టుగా ఉంచగలరు. కానీ నిజమైన అధికారం కలిగిన సీఈఓలతో కూడిన కంపెనీగా పార్టీని నిర్వహించకపోతే కాంగ్రెస్‌కు ఇక భవిష్యత్తు లేనట్లే. పైగా అధికారం హక్కు భుక్తం అనే భావనకు ఇప్పుడు యువ భారతం పూర్తి వ్యతిరేకం. రాహుల్‌ తన వారసత్వ రికార్డుతో వారిని మెప్పించడానికి ప్రయత్నించడం వ్యర్థం. ఇకనుంచి రాహుల్‌ తన గురించి తాను మాట్లాడితే మంచిది.

ఇక ఉత్తర ప్రదేశ్‌లో కుల ప్రాతిపదిక రాజకీయ పార్టీలు తమను తాము పునర్నిర్మించుకోవాలి లేక సన్యా సమైనా పుచ్చుకోవాలి. కులాలుగా చీలిపోయిన దేశ ప్రధాన కేంద్రంలో మూడు దశాబ్దాలుగా బీజేపీ హిందు త్వ అనే విశ్వాసంతో మెజారిటీని కూడగట్టే వ్యూహంతో పని చేసింది. హిందువులు ఉన్నత, నిమ్న, మధ్యతరగతి కులాలుగా వేరుపడటం కాకుండా కలిసి కట్టుగా ఓటేసి నంత కాలం ఇక బీజేపీని ఓడించటం అసాధ్యం. గతంలో రామమందిరం ఉద్యమం ద్వారా ఎల్‌కే అడ్వాణీ ఈ విషయంలో కొంత సఫలమయ్యారు కాని అది కొన్నాళ్లే ప్రభావం చూపింది. ఇప్పుడు మెజారిటీ భారత జాతీయ    వాదం ద్వారా మోదీ, అమిత్‌ షాలు కొత్త ప్రభంజనం సృష్టించారు.

ముఖ్యమైన వాస్తవం ఏదంటే ముస్లిం ఓటర్లు భవి ష్యత్తు గురించి చింతిస్తున్నారు. మోదీ–షా వ్యూహం ముస్లిం ఓటును వేరు చేసింది. అదిప్పుడు అసంగతమైన విషయమని నిరూపించారు. ‘లౌకిక పార్టీ’లు తమ రాజ కీయాలను ఇకపై పూర్తిగా తిరగ రాసుకోవాల్సిందే.


- శేఖర్‌ గుప్తా

twitter@shekargupta

మరిన్ని వార్తలు