ఇంద్రవెల్లి నుంచి బస్తర్ దాకా

30 Apr, 2016 01:52 IST|Sakshi

ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న జరిగిన పోలీసు కాల్పుల్లో 60 మంది ఆదివాసులు అమరులయ్యారు. అయితే 13 శవాలు మాత్రమే దొరికి వారి వివరాలు తెలిశాయి. ఆ మారణకాండ ఆ ఒక్కరోజే జరిగినట్లు కనిపిం చినా ఇరువైపులా దానికి పూర్వరంగం ఉంది. ఇంద్రవెల్లి కాల్పులు జరిగి 35 ఏళ్లయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సారి  కేవలం రెండు వందల మంది ఆదివాసులను, వాళ్ల ఎంఎల్‌ఏను మాత్రమే స్థూపం దగ్గరికి వెళ్లి స్మరించుకోవడానికి అనుమతించింది. ఈ సందర్భంలో పేరు చెప్పడా నికి ఇష్టపడని ఒక పోలీసు అధికారి, ‘ఆ రోజు ఏపీ స్పెషల్ పోలీసు బెటాలియన్‌కు చెందిన మహమ్మద్ గౌస్‌ను ఆదివాసీలు చంపి ఉండకపోతే అంతటి మారణకాండ జరిగి ఉండేది కాదు’ అన్నాడు.
 
కానీ ఆ ఘటనపై పీయూడీఆర్ నాయకుడు మనోరంజన్ మహంతి నేతృత్వంలో నిజనిర్ధారణ బృందం ప్రకటించిన నివేదికలో ‘పోలీసుల నిష్కా రణ కవ్వింపు చర్యల ఫలితంగా ఉద్రిక్తులైన జనా నికి, పోలీసులకు మధ్యన జరిగిన దొమ్మీలో ఒక పేద కానిస్టేబుల్ ప్రాణాలు పోగొట్టుకోవడం దుర దృష్టకరం’ అని పేర్కొన్నారు.
 
అసలు ఆరోజు ఏం జరిగిందో తెలుసుకుంటే దీనికి మూలం అర్థమవుతుంది. ఆదివాసులు పోడు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, పండిం చిన పంటలకు గిట్టుబాటు ధరలివ్వాలని గిరిజన రైతుకూలి సంఘం పెట్టుకున్న సభకు ముందుగా అనుమతి ఇచ్చిన పోలీసులు 1980 ఏప్రిల్ 19 సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష జరిపి అనుమతి రద్దు చేసి 144 సెక్షన్ విధించారు. దూర ప్రాంతాల నుంచి కాలినడకన బయలుదేరిన ఆదివాసులకు 144వ సెక్షన్ అంటే ఏమిటో తెలీదు. ఒక విధంగా వాళ్లు పక్షులను పట్టడానికి పన్నిన వలలో అవి చిక్కు కున్నట్లుగా వచ్చి కాల్పులకు గురయ్యారు.
 
ఇంద్రవెల్లి ఆవల ఇంత కథ ఉంటే గత 35 ఏళ్ల కాలంలో దండకారణ్యం అంతటా విప్లవోద్యమం జల్, జంగిల్, జమీన్లతోపాటు ఇజ్జత్, సత్తా (అధి కారం) కోసం కూడా పోరాటంగా ప్రజాయుద్ధంగా గుణాత్మకంగానే పరిణతి చెందింది. అప్పుడు కానీ, నేడు కానీ ఆదివాసీలపై మారణకాండ, స్త్రీలపై పోలీ సులు సామూహిక లైంగిక అత్యాచారాలు వంటి వాటిని తటస్థంగా ఉంటూనే రిపోర్టు చేస్తున్న సంద ర్భంలో జర్నలిస్టులపై త్రీవ దాడులు జరుగుతు న్నాయి.  సంతోష్ యాదవ్, సోమార్ నాగు, ప్రభా త్సింగ్‌తో పాటు మాలినీ సుబ్రహ్మణ్యంను బస్తర్ నుంచి వెళ్లగొట్టడమే కాకుండా వీరిని నక్సల్స్ సాను భూతి పరులని చిత్రీకరిస్తున్నారు. బీబీసీ కరస్పాం డెంట్ అలోక్ పుతుల్ ఐజీ కల్లూరితో మాట్లాడాలని ప్రయత్నిస్తే ‘నాకు దేశద్రోహులైన రిపోర్టర్లతో మాట్లాడేందుకు సమయం లేద’ని నిరాకరించాడు.
 
హిందూ, బీబీసీ రిపోర్టర్లయినా సరే కోల్‌కతా నుంచి బస్తర్ వెళ్లి రిపోర్టు చేయాల్సిందే తప్ప బస్త ర్‌లో తిరిగి రిపోర్టు చేసే పరిస్థితి లేదు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాలకు వెళ్లి రిపోర్టు చేసే పరిస్థితి కూడా తమకు లేదని జగదల్‌పూర్ పత్రికా సంఘం అధ్య క్షుడు కరీముద్దీన్ చెప్పారు. పోలీసుల అధికార ప్రక టనలను మాత్రమే ప్రకటించి నోరుమూసుకో కుండా స్వతంత్రంగా వ్యవహరిస్తే వారిని మావో యిస్టు సానుభూతిపరులుగా చిత్రీకరించి వారిపై కేసులు పెట్టి, అరెస్టులు చేయిస్తున్నారు.

ఇక సోనీ సోరీ అక్కడి సమాజంలో భాగమై పోరాటం చేస్తు న్నందువల్ల ఆమెను, ఆమె కుటుంబాన్ని చంపుతా మని ఐజీ కల్లూరి నియోగించిన మాఫియా బెదిరి స్తోంది. దాని ఫలితమే ఆమెపై ఆసిడ్ దాడి. ఇండియా టుడే బృందం వెళ్లి చేసిన పరిశోధనలో, సామాజిక ఏక్తా మంచ్ పేరుతో పనిచేస్తున్న సంస్థ  సల్వాజుడుం రెండో రూపమని, అది ఐజీ కల్లూరి ఏర్పాటు చేసిందేనని బయటపడటంతో దాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పోలీసు ఆధికారులే ఒప్పుకున్నా రు. బస్తర్ మాడ్‌లో ఉన్న ప్రకృతి సంపదను, ఖనిజా లను ఎంఎన్‌సీలకు, మైనింగ్ మాఫియాకు కట్టబెట్ట డానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానవ రహిత విమానంలో క్షిపణి దాడులు కూడా చేస్తున్నట్లు తేలుతున్న నేపధ్యంలో మీడియా తన సమస్త పరిమితులను అధిగమించి నిష్పాక్షిక రిపోర్టింగ్ ఇవ్వడమే క్షేత్రస్థాయిలో వారెదుర్కొంటున్న ముఖ్య మైన సమస్యగా ఉంటోంది.
(నేడు కో-ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ సదస్సు సందర్భంగా)
వ్యాసకర్త: వరవరరావు (విరసం వ్యవస్థాపక సభ్యులు)

>
మరిన్ని వార్తలు