ఫిరాయింపు రాజకీయాలు అనైతికం

9 Nov, 2016 03:02 IST|Sakshi
ఫిరాయింపు రాజకీయాలు అనైతికం

మనసులో మాట
కొమ్మినేని శ్రీనివాసరావుతో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ
సామాన్యులలో సామాన్యుడిగా పుట్టి ఎదిగివచ్చినందుకే జనంలో తిరగడం, జనంతో ఉండటం తనకెంతో ఇష్టమంటున్నారు కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ. ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్‌లోని నిరుపేద ప్రాంతం గౌలిగూడలో రెండు గదుల ఇంటిలోనే చాలా కాలం గడిపిన దత్తాత్రేయ తన తల్లిదం డ్రుల సంస్కారం, ఆర్‌ఎస్‌ఎస్ సంఘ జీవితం తనను ఇంత స్థాయికి తీసుకొచ్చిం దని అంటున్నారు. ఫిరాయింపులు అనైతికం అనీ బీజేపీ వాటిని సమర్థించదని చెప్పారు. రాజకీయ లబ్ధికోసం చేసిన సందర్భాల్లో కూడా అది అనైతికమే అంటున్న బండారు దత్తాత్రేయ మనసులో మాటలో చెప్పిన అభిప్రాయాలు.. వారి మాటల్లోనే
 
మీ బాల్యం, కుటుంబ నేపథ్యం ఏమిటి?
పేదకుటుంబంలో జన్మించాను. తల్లితండ్రులు ఈశ్వరమ్మ, అంజయ్య. హైదరా బాద్‌లో గౌలిగూడ అనే పేదల బస్తీలో పెరిగాను. నాన్న చిన్నప్పుడే చనిపోవడం. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో మా అమ్మ ఉస్మాన్ గంజ్ అనే ప్రాంతానికి వెళ్లి రోడ్డు మీద ఉల్లిపాయలు అమ్ముకుని బతికి మమ్మల్ని సాకింది. నేను ఎదగడానికి ప్రధాన కారణం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం.

ఎంపీ అయిన తర్వాత కూడా గౌలిగూడలోనే ఉన్నారు కదా?
కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా నేను గౌలిగూడలోనే ఉన్నాను. నేనూ, నా భార్యా, పిల్లలూ ఒకే గదిలో నివసించేవాళ్లం. అమ్మ ఒక గదిలో ఉండేది. నాకు బాగా గుర్తు. ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డి ఒకసారి కష్టం మీద మా ఇంటికి వచ్చి చూశారు. ‘ఎంిపీగా ఉండి కూడా ఇంత చిన్న ఇంట్లో ఉన్నావు. చాలా సంతోషం. మీ అమ్మ మీకు ఆదర్శం’ అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్‌తో ఎలా పరిచయమైంది?
పదో తరగతి చదువుతున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ శాఖ సమావేశానికి రమ్మని మనోజ్ అనే డాక్టర్ ఆహ్వానించారు. అమ్మ ఒత్తిడి వల్ల ఒకసారి వెళ్లాను. అదే నా జీవితంలో మలుపు. 1968లో డిగ్రీపూర్తి చేశాను. సంఘం లోకి వెళ్లిన తర్వాతే దేశభక్తికి సంబంధించిన అనేక భావాలు ఏర్పడుతూ వచ్చాయి. ప్రచారక్‌గా వెళతానని చెబితే అమ్మ ఒప్పుకుంది. నిజామాబాద్‌లో ప్రచారక్‌గా తొలి బాధ్యత. 1975 వరకు ఇలా పనిచేశాను.
 
రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారు?
రాజకీయాల్లోకి వస్తానని ఊహించ లేదు. కానీ ఎమర్జెన్సీ కాలంలో బెల్లం పల్లిలో అరెస్టై ఒకటిన్నరేళ్లు జైల్లో ఉన్నాను. వరవరరావు, చెరబండరాజు, ఎంటీ ఖాన్, మరొకవైపు సోషలిస్టు నాయకులు నాయని నరసింహారెడ్డి, శ్రీధర్ సింగ్ లష్కర్, గౌతు లచ్చన్న, వి. రామారావు, గౌతు లచ్చన్న వంటి వారితో అక్కడ పరిచయమైంది. అక్కడే చదువుకోవడం మొదలెట్టాను. కాస్త ఆలోచన పెరిగింది. 1977లో జైలు నుంచి విడుదలైన తర్వాత దివిసీమలో ఉప్పెన వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్ తుపాను బాధితుల కమిటీలో జాయింట్ సెక్రటరీగా పనిచేశాను. అక్కడ సేవాభావంతో పొందిన గుర్తింపే చివరకు రాజకీయాల్లోకి తీసుకొచ్చింది.
 
టీడీపీతో పొత్తు లేదని మీ నేతలే అంటున్నారు?
పొత్తు అనేది ఎన్నికలకు సంబంధించింది. ఎన్నికలు లేవు కాబట్టి పొత్తుల అవ సరం ఇప్పుడు లేదు. అలాగని భవిష్యత్తును ఎవరూ చెప్పలేరు. రాజకీయాల్లో ఇవ్వాళ మిత్రులుగా ఉన్నవారు రేపు ప్రత్యర్థి కావచ్చు. ఇవ్వాల్టి ప్రత్యర్థి రేపు మిత్రుడు కావచ్చు.
 
ఓటుకు కోట్లు కేసు వంటి అంశాలపై మీరు ఎందుకు మాట్లాడటం లేదు?
ఇది రాజ్యాంగపరమైన విషయం. దీంట్లో చట్టం, నైతికత అనే రెండు విషయా లున్నారుు. నైతికత, చట్టం విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పే.

చంద్రబాబు తప్పు చేసినట్లా చేయనట్లా? బాబు, కేసీఆర్ రాజీపడ్డారా?
చట్టం తన పని చేస్తోంది కదా ఇప్పుడు.. వారిమధ్య రాజీ మేం కుదర్చలేదు. కేసీఆర్ షరతు పెట్టడం వల్లే బాబు విజయవాడ వెళ్లిపోయారనడంలో వాస్తవం లేదు.

బాబు, కేసీఆర్ ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లోంచి బయటపడ్డట్లేనా?
అది రాజకీయ వ్యవహారం. వారి పద్ధతిలో వారు వెళుతున్నారు.

ఫిరాయింపులపై మీ అభిప్రాయం?
ఒక్కమాటలో చెప్పాలంటే ఫిరాయింపులు అనైతికం. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీకైనా, వ్యవస్థకైనా ఫిరాయింపులు మంచివి కాదు. రాజకీయ లబ్ధికోసం చేయ వచ్చునేమో కానీ ఇది తప్పకుండా అనైతికం.

మరి మీ అభిప్రాయం కేసీఆర్‌కి, చంద్రబాబుకు చెప్పారా?
వాళ్ల వాళ్ల పద్ధతిలో వాళ్లు రాజకీయం చేస్తున్నారు. నా సలహా కోరలేదు.

మీరు కాని వెంకయ్య కాని ఫిరాయింపులు తప్పని వారికి చెప్పలేదా?
వ్యక్తులకు చెప్పడం అని కాదు కానీ... జాతీయ స్థారుులోనే ఫిరాయింపులకు వ్యతిరేకంగా మేం వ్యవహరించాం. వెంకయ్యనాయుడు ఫిరాయింలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు.
 
కేసీఆర్‌కి, చంద్రబాబుకు మీరిచ్చే సలహా ఏమిటి?
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మధ్య పరస్పర సహకారం ఎంత ఎక్కువగా ఉంటే అభివృద్ధి అంత ఎక్కువగా జరుగుతుంది.

కేంద్రమంత్రిగా మీరు సాధించిన విజయాలు ఏవి?
దేశంలోని కార్మికులందరికీ కనీస వేతనం గతంలో రోజుకు రూ. 160 ఉంటే ఇప్పుడు రూ.350లు పెంచడం కార్మికమంత్రిగా నాకెంతో సంతోషం కలిగిం చింది. అలాగే మహిళా కార్మికులందరికీ మెటర్నిటీ లబ్ధిని 12 వారాలనుంచి 26 వారాలకు పెంచాను. ఇక బోనస్ రూ. 3,500 ఉంటే దాన్ని రూ. 7 వేలకు పెంచాను. బీమా కవరేజ్ పది వేలు ఉంటే రూ. 21 వేలకు పెంచాను. ఈఎస్‌ఐ రూ.15 వేలకు ఉంటే దాన్ని 21 వేలకు చేశాను.

ఉమ్మడి రాష్ట్ర సీఎంలపై మీ అభిప్రాయం?
పాత ముఖ్యమంత్రులలో వెంగళరా వును చూశాను. మాట తక్కువ పని ఎక్కువ. వెంగళరావు, చెన్నారెడ్డి, విజయ భాస్కరరెడ్డి, ఎన్టీఆర్ వీరందరిలో విశేషం ఏమంటే,  పాలనలో చాలా దృఢంగా ఉండేవారు. ఎన్టీఆర్ ప్రజాకర్షణలో సాటిలేని వ్యక్తి. కాంగ్రెస్ తప్పులను ఏమాత్రం క్షమించే వాడు కాదు. తర్వాతి వారిపై కూడా ఆయన ముద్రవేసి వెళ్లాడు. విజయ భాస్కరరెడ్డి నీతి నిజాయితీగల నాయకుడు. చాలా గౌరవించే నాయకుడాయన.

వైఎస్ రాజశేఖరరెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం?
ప్రజలతో మమేకమై పనిచేశారు. ఆరోగ్యశ్రీ, పిల్లలకు స్కాలర్ షిప్‌లు ఇలాంటి అంశాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లారు. ప్రజలపట్ల గౌరవం అపారం.

కేసీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలపై ప్రజా వ్యతిరేకత ఏమేరకు ఉంది?
దీనిపై మరికొన్నాళ్లు వేచి చూడాలి. ఇద్దరూ వేగంగా సాగుతున్నారు కాబట్టి ప్రజలు అంత వేగంగా వారిని అర్థం చేసుకుంటారా అన్నది చూడాలి.

తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు కష్టపడి పనిచేసేవారు. రెండు ప్రాంతాల ప్రజలు పరస్పరం గౌరవించుకుని ఆత్మీయంగా మెలిగే పరిస్థితులు ఉండాలి. విద్వే షాలకు ఎక్కడా తావుండకూడదు. అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. భవి ష్యత్తులో విద్యా, వైద్యం, ఉపాధి ఈ మూడింటికి తెలుగు రాష్ట్రాలు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలి.

 ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి
 https://www.youtube.com/watch?v=_VHA3x2nw-0