ప్రేమ వివాహాలకూ ఆర్టీఐ

12 Aug, 2016 01:35 IST|Sakshi
ప్రేమ వివాహాలకూ ఆర్టీఐ

విశ్లేషణ

తమ పిల్లలు ఎవరిని ఎప్పుడు వివాహం చేసుకుంటున్నారో తెలుసుకునే హక్కు తమకు లేదా? అనే తల్లిదండ్రుల ఆవేదన సబబే. కానీ అన్ని విధాలుగా అర్హులైన వారి ప్రేమ స్వేచ్ఛను, జీవన హక్కును హరించడం చట్ట ప్రకారం చెల్లదు.
 

పెళ్లిని రిజిస్టర్ చేయడానికి ఉన్న నియమాలు, పద్ధతులు, పత్రాలు, ఫీజు, సాక్షుల అర్హ తల వివరాలు ఇవ్వాలంటూ ఒక తల్లి ఆర్టీఐ కింద వివాహాల రిజిస్ట్రార్‌ను కోరారు. పిల్లలు వివాహం చేసుకునే విషయమై తల్లిదండ్రులకు నోటీసు ఇవ్వ కూడదని నిర్దేశించే నియమా లున్నాయా? మోసపూరితమైన వివాహాలు చేసుకునే వారికి ఏ విధమైన శిక్ష విధిస్తారు? అనేవి అసలు ప్రశ్నలు. ప్రేమపేరుతో వంచనలు, తల్లిదండ్రులకు చెప్పకుండా వివాహాలు చేసుకుంటూ ఉంటే.. ప్రభుత్వం కూడా వారికి చెప్పనవసరం లేదని నియమాలు చేసిందా? అని ఆమె ప్రశ్న. మోసపూరితమైన పెళ్లిళ్లను ఆపకపోతే జీవితాలు పూర్తిగా దెబ్బ తింటాయని ఆమె ఆవేదన. కని పెంచి, పిల్లల భవిష్యత్తు కోసం త్యాగాలు చేసి ఆశలు నింపుకుని అనుబంధాలు అల్లుకున్న కుటుంబం.. పిల్లలకు 18, 21 ఏళ్ల వయసు రాగానే తమ బాంధవ్యాలను వదులుకోవాలని ఎక్కడుంది? కనీసం తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎవరిని ఎప్పుడు వివాహం చేసుకుంటున్నారో తెలుసుకునే హక్కు లేదా? రిజిస్టర్ చేసే అధికారులైనా చెప్పకూడదా? పిల్లలకోసం జీవి తాలు ధారపోసిన తల్లిదండ్రుల ఆవేదన ఇది.  

మన పూర్వీకులు 8 రకాల వివాహాలను గుర్తిం చారు. అవి బ్రాహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, ఆసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం. ఆధునిక ప్రేమవివాహాలను గాంధర్వ వివాహాలతో పోల్చవచ్చు. అన్నీ అబద్ధాలు చెప్పి చేసుకునే మోసపు పెళ్లిళ్లు పైశాచం అని వేరే చెప్పనవసరం లేదు. వధువు డబ్బు ఇస్తేనే చేసుకునే పెళ్లి నవనాగరిక దుర్మార్గమనీ, డబ్బుకోసం భార్యలను చంపడం అనాగరిక ఆధునికత అనీ మన పూర్వీకులకు తెలియదు కాబట్టి ఇలాంటి వాటిని వారు ఊహించలేదు. మతాచార వివాహాలను హిందూ, క్రైస్తవ, ముస్లిం వివాహ చట్టాలు గుర్తించారుు. మతా తీత, దేశాంతర, కులాంతర వివాహాలకు ప్రత్యేక వివాహ చట్టం చేశారు. అన్నాచెల్లెళ్ల వంటి రక్త సంబం ధీకుల మధ్య వివాహాలను నిషేధించారు. భాగస్వామి బతికుండగా పెళ్లి చేసుకోవడం నేరం. ఊరేగింపులు, ఉత్సవాలు సమాజానికి తెలియజేసే పద్ధతులు. ఫలానా జంట చట్టబద్ధ్దమైన వివాహ బంధంలో ఉన్నారని ఇవి వివరిస్తారుు.

అయితే ఉత్సవాలు అనేవి ప్రత్యేకచట్టం కింద  సాక్ష్యాలు కావు, ధ్రువపత్రమే సాక్ష్యం. కనుక రిజి స్ట్రేషన్‌కు ముందు నెలరోజుల నోటీసు ఇస్తారు. మొత్తం ప్రపంచానికే ఈ నోటీసు. కాని ఈ నోటీసు రిజిస్ట్రేషన్ ఆఫీసు గోడలకే పరిమితం అవుతుంది. కొందరు పత్రి కల్లో ప్రచురిస్తారు. ఈ ఇద్దరి వివాహానికి అభ్యంతరాలు ఏమిటో తెలియజేయాలని సమాజాన్ని కోరడమే ఈ నోటీసుల ఉద్దేశం. వారి మధ్య నిషేధ సంబంధాలున్నా, లేదా వారికి ఇదివరకే పెళ్లరుునా, ఆ విషయాలు రిజి స్ట్రార్‌కు తెలియజేయాలి. అభ్యంతరాలు నిజమే అరుుతే వివాహాన్ని రిజిస్టర్ చేయడానికి వీల్లేదు. ముందు వివాదం తేల్చుకుని రమ్మంటారు. నిజానికి ఈ నోటీసు చాలా కీలకమైంది. కాని ఖాళీ లాంఛనంగా మారింది. గతంలో చేసుకున్న వివాహ వివరాలను రహస్యంగా దాచుకుంటారు. ఆఫీసు గోడలమీద నోటీసులు వెతు క్కోవడం తల్లిదండ్రులకు, మొదటి భార్యలకు, ఇతర ప్రేమికులకు సాధ్యం కాదు. పత్రికల్లో వేయడం కొంత వరకు నయం. అరుునా అదీ చూస్తారని గ్యారంటీ లేదు. నోటీసు ఇచ్చిన ప్రేమికులు నెలరోజులు ఆగాలి. లేక పోతే అది మోసమే. వివాహ అధికారి దర్యాప్తు చేయాలి. సమన్లు జారీ చేసి రమ్మనాలి, పత్రాలు తెమ్మనాలి.

 అరుుతే మరొక తీవ్ర ప్రమాదం కూడా పొంచి ఉంది. కులాంతర వివాహాలను, తమకు నచ్చని వివా హాలను ఆమోదించని తల్లిదండ్రులు, బంధువులే శత్రు వులుగా మారి చివరకు కూతుళ్లను అల్లుళ్లను హత్య చేరుుంచే దారుణాలు జరుగుతున్నారుు. ఖాప్ పంచా యతీల నుంచి, వివాహ వ్యతిరేక ఫత్వాలనుంచి వధూ వరులను రక్షించే బాధ్యత ప్రభుత్వంపైన ఉంది. పెళ్లి స్వేచ్ఛ ఉన్నా మోసంచేయడం నేరమే. అర్హులైన వారి ప్రేమస్వేచ్ఛను, జీవన హక్కును హరించడం చెల్లదు. తమకు ఈ ప్రమాదం ఉందని మేజర్ యువతీ యువ కులు దరఖాస్తు పెడితే, ఇతర అర్హతలన్నీ సరిపోరుున పక్షంలో, వారికి భద్రత కలిగించే ఏర్పాట్లు చేయాలి. వివాహాల నోటీసులను రిజిస్ట్రార్ కార్యాలయం అధి కారిక వెబ్‌సైట్‌లో ప్రచురించాలని, అనర్హుల వివాహాల నిరోధానికి ఇది ఉపయోగపడుతుందని సమాచార కమి షన్ నిర్ణరుుంచింది. (శశి వర్సెస్ ఎస్‌డీఎం కేసు నెంబర్ సీఐసీ, ఎస్‌ఏఏ, 2016, 001556 కేసులో ఆగస్టు 1న ఇచ్చిన తీర్పు ఆధారంగా).

వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్
ఈమెయిల్: professorsridhar@gmail.com

 

మరిన్ని వార్తలు