ఆయన దారే వేరు

16 May, 2017 01:53 IST|Sakshi
ఆయన దారే వేరు

విశ్లేషణ
నారాయణ రాణేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎన్నికల ద్వారా లభించగల అత్యు న్నత పదవిౖయెన ముఖ్య మంత్రిగా పని చేసినా, ఆయన చుక్కాని లేని నావలా ఎటుపడితే అటు కొట్టుకుపోతున్న రాజకీయ వేత్త. శివసేనను వదిలిపెట్టే   శాక ఆయన కాంగ్రెస్‌ను ఎంచుకున్నారు. కానీ ఆ పార్టీలో ఇమడలేక పోతున్నారు. శివసేన ఆయన తిరిగి పార్టీలోకి రావాలని కోరుకోవడమూ లేదు. రాణే స్వతం త్రంగా, సూటిగా వ్యవహరించే మనిషి. విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్‌ అశోక్‌ చవాన్‌కు ఆ పదవిని కట్టబెట్టింది. అసమ్మతిని వ్యక్తంచేసిన రాణేను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. తన స్వభావానికి విరుద్ధంగా ఆయన కాళ్లావేళ్లా పడి తిరిగి పార్టీలోకి ప్రవేశించారు. కానీ ఆ పార్టీలోని ఇతరులకు పెద్ద తలనొప్పిగా మారారు, ఆయనా సౌఖ్యంగా ఉన్నది లేదు. అయినా కాంగ్రెస్‌ ఆయనను పార్టీలోనే ఉంచుకోవాలని ప్రయత్నిస్తోంది.

కాంగ్రెస్‌లో అసౌకర్యంగా ఉండటంతో రాణే భార తీయ జనతా పార్టీ వాకిటికి చేరారు లేదా దగ్గరయ్యారు. అయితే తలుపులు ఇంకా పూర్తిగా తెరుచుకోలేదు. ఆయన  ప్రవేశానికి ఆ పార్టీలో కొంత విముఖత ఉన్న దనిపిస్తోంది. పూర్తిగా ‘ఎన్నికలపరమైన ప్రతిభ’ లేదా ఎన్నికల్లో గెలవగల సామర్థ్యం ఉన్నవారినే పార్టీలోకి తీసుకుంటామంటున్నా... అభ్యంతరకరమైన నేపథ్యా లున్న ఎందరికో బీజేపీ దేశవ్యాప్తంగా తలుపులు తెరి చింది. రాణేను అనుమతించడం జరిగి, ఒక్కసారి ఆయన పార్టీలోకి ప్రవేశించారూ అంటే క్రమశిక్షణకు కట్టుబడరనీ, తిరిగి అత్యున్నతమైన ముఖ్యమంత్రి పద విని చేజిక్కించుకోవడానికి సమయం కోసం వేచి చూçస్తూ నిరంతరం ప్రకంపనాలను సృష్టిస్తుంటారనీ రాష్ట్ర బీజేపీలోని అత్యున్నతస్థాయి నాయకత్వ శ్రేణు లకు భయం ఉంది. మనోహర్‌ జోషి స్థానంలో బాల్‌ ఠాక్రే, రాణేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నియమిం చారు. అయితే 1999 ఎన్నికల్లో శివసేనను తిరిగి అధికా రంలోకి తేవటంలో ఆయన విఫలమయ్యారు.

రాణే దేన్నీ లెక్కచేయని దురుసు మనిషి. తాను ఏమైనా మాట్లాడాలని నిర్ణయించుకుంటే చాలు, నీళ్లు నమలకుండా సూటిగా చెప్పేస్తారు. ఉద్ధవ్‌ ఠాక్రే శివ సేనను నడుపుతున్న తీరును చూసి నిరాశచెంది ఆయన ఆ పార్టీ నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో ఆయన తనపై భౌతిక దాడులు జరుగుతాయనే భయం లేదన్నారు. శివసేన అత్యున్నత నాయకత్వంతో ఘర్షణ పడి, పార్టీని వీడే తిరుగుబాటుదార్లకు తరచుగా పట్టే గతి అదే.‘‘సేనలో ఉన్నప్పుడు పార్టీ వీధి కార్య కలాపాలను నడిపినది నేనే’’ అన్నారు రాణే. కాంగ్రెస్‌ లోనూ ఆయన తనకు పరిస్థితి కాస్త సౌఖ్యంగా ఉండేలా చేసుకుంటున్నది లేదు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌  సీపీ)తో ఎన్నికల అనంతరం చెలిమి చేస్తున్న కాంగ్రెస్‌ ప్రస్తుతం రైతులను కలుసుకునే కార్యక్రమాన్ని చేప ట్టింది. ఆ కార్యక్రమం సజావుగా సాగడం లేదని, దయ నీయస్థితిలోని రైతులు దాని పట్ల స్పందించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తృణీకారంతో ఆయన దానికి దూరంగా ఉన్నారు. ఆయన తనకు తోచిందే చేసే స్వతంత్ర వ్యక్తిత్వంగల మనిషి.

తనకు మేలు చేసినందుకు ఆయన ఎవరికీ ఏవిధం గానూ రుణపడి లేరు. వీధుల్లోని శివ సైనికుని స్థాయి నుంచి ఆయన ముఖ్యమంత్రి స్థానానికి చేరారంటే అందుకు కారణం ఆయన నేర్పరితనమే. ముఖ్య మంత్రిగా విజయవంతమౌతూ వినమ్ర ప్రియభాషిగా పేరు తెచ్చుకుంటున్న జోషితో బాల్‌ ఠాక్రే అసౌకర్యంగా ఉన్నారని పసిగట్టడంతోనే ఆయన ఆ స్థానం కోసం కృషి మొదలెట్టేశారు. బహుశా ఆయన ఎవరితోనైనా ఒప్పందం అంటూ కుదుర్చుకుని ఉంటే అది ఒక్కసారే కావచ్చు. ఈ వైచిత్రి, రాణే వృద్ధిలో భాగమే. నేడు దారి తెన్నూ లేకుండా కొట్టుకుపోతున్నా, ఆయన తన సొంత జిల్లా సింధుదుర్గ్‌లో సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. ఆయన ఎంత ఆత్మవిశ్వాసం గల మనిషంటే శివసేనను వీడిన వెంటనే ఆయన ఒక ఉప ఎన్నికలో శాసనసభకు గెలిచి, తాను ముఖ్యుడిననే అంశాన్ని  రుజువుచేసి చూపారు.

ఆయన సామ్రాజ్యం కేవలం వ్యాపారానికే పరి మితం కాలేదు, ఒక రాజకీయ కుటుంబం ప్రారం భమైంది. ఆయన ఒక కుమారుడు నీలేష్‌ 2009లో రత్నగిరి–సింధుదుర్గ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరో కుమారుడు నితేష్‌ రాష్ట్ర శాసన సభ సభ్యునిగా ఉన్నారు. నితేష్‌ కార్మిక సమస్యలను కొంత మేరకు పట్టించుకునే ఒక ఎన్‌జీఓను నడు పుతున్నారు. అది కూడా శివసేనలాగే మాట్లాడుతుంది, అదే పద్ధతులను అనుసరిస్తుంది. రాణే తన ప్రయోజనా లను, కుటుంబ ప్రయోజనాలను కాపాడుకోడానికి ఒక మరాఠీ దినపత్రిక ‘ప్రహార్‌’ను (మృత్యు ఘాతం) ప్రారంభించారు. ఆ పత్రిక పేరే ఆయన శైలి రాజ కీయాలను సూచిస్తుంది. ఆ పత్రిక వృత్తినైపుణ్యంతోనే పని చేయాలని యత్నిస్తోంది. అయితే చాలా మంది రాజకీయవేత్తలు, రాజకీయపార్టీలు ఎంచుకున్న మార్గ మైన టెలివిజన్‌ రంగంలోకి రాణే ప్రవేశించలేదు, సమీప భవిష్యత్తులో అది జరిగేట్టూ లేదు. అయితేనేం, ఆయన సమరశీలత నిత్యం కనబడుతుంటూనే ఉంటుంది.

మహేష్‌ విజాపృకర్‌
సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌: mvijapurkar@gmail.com

మరిన్ని వార్తలు