పదవి కన్నా గౌరవం మిన్న కాదా?

28 Feb, 2017 01:26 IST|Sakshi
పదవి కన్నా గౌరవం మిన్న కాదా?

విశ్లేషణ
శివసేన , బీజేపీలు కలసి పారదర్శక పాలనను అందించలేవు. బీజేపీ ప్రతి పక్షంలో ఉంటే అందుకు ప్రయత్నించవచ్చు అది గౌరవప్రదమైనది. కానీ రాజకీయాల్లో గౌరవం కోసం పాకులాడేది ఎవరు?

బడ్జెట్‌ రీత్యా చూస్తే ముంబై కన్నా పెద్ద మునిసిపల్‌ కార్పొ రేషన్‌ లేదు. దాని వార్షిక బడ్జెట్‌ రూ. 37,000 కోట్లు. అదింకా పెరుగు తోంది. అయినా దుష్పరిపా లన అనే తీవ్ర రుగ్మత దాన్ని పట్టి పీడిస్తూనేవుంది. ఆ సంస్థ,  అభివృద్ధి కోసం కేటా యించిన నిధులలో సగం కంటే ఎక్కువ ఎన్నడూ ఖర్చు చేసి ఎరుగదు. దీనికి తోడు దేశంలోని అన్ని పరిపాలనా సంస్థల విలక్షణతైన అవినీతి ఇక్కడా పౌర పాలనకు సంబంధించిన అన్ని అంశాలలోనూ కనిపి స్తుంది. రోడ్లే అందుకు ఉదాహరణ.

దీనిపై నియంత్రణ కోసం శివసేన, బీజేపీలు పోటీ పడ్డాయి. పౌర పరిపాలనా సంస్థకు జరిగిన తాజా ఎన్నికల్లో బీజేపీ(82) కంటే శివసేన(84) రెండు సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. రెండూ సంఖ్యా బలాన్ని మెరుగుపరుచుకున్నాయి. ఇప్పుడవి మేయర్‌ పదవి కోసం పోటీపడుతున్నాయి. 227 మంది సభ్యు లున్న కార్పొరేషన్‌లోని అతి పెద్ద పార్టీగా శివసేన ఆ హక్కు తనకే ఉందని భావిస్తోంది. కానీ మేయర్‌ పదవిని దక్కించుకోడానికి లేదా కార్పొరేషన్‌పై నిర పేక్ష అధికారాన్ని సాధించడానికి అదే సరిపోదు.

నగర పాలనలో పారదర్శకతకు పట్టంగడతా మన్న వాగ్దానం వల్లనే ఓటర్లు పెద్ద నోట్ల రద్దును పట్టిం చుకోకుండా బీజేపీకి ఇంతటి గౌరవం దక్కేలా చేశారు. నగర ప్రభుత్వపు వంచనాత్మక పద్ధతులను సరిచేయ డానికి హైకోర్టు పదే పదే జోక్యం చేసుకున్న మాట నిజం. అది ఆ సంస్థకు తీవ్ర అవమానకరం. శివసే నపై బీజేపీ అభిప్రాయం ఎలా ఉన్నా, మునిసిపల్‌ కార్పొరేషన్‌ పని తీరుకు హైకోర్టు ఆదేశాలే గీటురాయి.  
ఏదో ఒకలా ఒప్పందాలు కుదుర్చుకుని తమ పార్టీ మేయర్‌ పీఠాన్ని దక్కించుకోగలుగుతుందనే ఆశ బీజేపీలో తొంగిచూస్తోంది. తమకు శత్రువుగా మారిన మిత్రుడితో కలవడానికైనా అది సిద్ధంగా ఉంది. ఆ పార్టీలు రెండింటి మధ్యా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంబంధాలకు తగ్గట్టే బీజేపీతో శివసేన వ్యవహరించే ముప్పు ఉంది. ఇది బహుశా బీజేపీ చేసే పెద్ద తప్పు కావచ్చు. 2014 శాసనసభ ఎన్నికల్లో ఒకరి పైకి ఒకరు కత్తులు దూసుకున్నా అవి రెండూ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి చేతులు కలిపాయి.

కార్పొరేషన్‌ ఎన్నికల్లో అవి భాగస్వాములుగా నిలవకపోగా ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి విద్వే షపూరిత ప్రచారాన్ని సాగించాయి. ఇది, శివసేన తన శక్తు లను సంఘటితపరుచుకునేలా చేసింది. బీజేపీ ఎదుగుదలకు దోహదం చేసింది. కానీ రెండూ మెజా రిటీ రీత్యా త్రిశంకు స్వర్గంలోనే ఉన్నాయి. ఈ స్థితిలో బీజేపీ, తాను ఏ వాగ్దానంతో పోటీ చేసిందో ఆ పార దర్శకతను గౌరవించాలే తప్ప మేయర్‌ పదవి కోసం పాకులాడకూడదు. ప్రతిపక్షంగా నగరానికి మెరుగైన పాలనను అందించాలని శివసేనను గట్టిగా కోర వచ్చు. తద్వారా అది తన 82 సీట్ల బలమనే ప్రతికూల తను అనుకూలతగా మలుచుకోగలుగుతుంది.

అదే జరిగితే బీజేపీ గౌరవం మరింత ఇనుమడి స్తుంది. ఆ తర్వాత అది రాజకీయ పార్టీలకు అలవాటైన రీతిలో∙ఒప్పందాలను.. శివసేనతో సైతం కుదుర్చుకో వచ్చు. 2014లో శివసేన చేసింది ఇదే. అప్పుడది రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడానికి తిరస్కరించింది. ఆ తర్వాత హఠాత్తుగా పదవులపై మక్కువతో ప్రభు త్వంలో చేరింది. కయ్యాలమారి భార్యాభర్తల కాపు రంలా కలహాలు సాగుతూనే ఉన్నాయి.   

2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల మైత్రి విచ్ఛిన్నమైన తర్వాతే బీజేపీ ముంబై కార్పొరేషన్‌లో నిఘాదారు పాత్రను పోషించ సాగింది. అంతకు ముందు రెండు దశాబ్దాలూ అది శివసేనతో అధికా రాన్ని పంచుకుంది. కాబట్టి అది కూడా సహ నేరస్తురా లిగానే ఉంది. బీజేపీ తన తప్పును అంగీకరించ కపోగా, శివసేనను బలవంతపు వసూళ్ల పార్టీగా, మాఫియా పార్టీగా సైతం విమర్శించింది. కార్పొరేష న్‌ను పాలించే ఏ పార్టీ అయినా బలవంతపు వసూళ్లకు పాల్పడకుండా ఉండటం అరుదే. అలా అని లంచా లను స్వీకరించడాన్ని ఒక జీవన విధానంగా, ప్రామాణి కమైనదిగా ప్రజలు ఆమోదించాల్సిందేనని కాదు.

శివసేనకు నగరంపై పూర్తి నియంత్రణను కట్ట బెట్టకుండా ఓటర్లు దాన్ని శిక్షించడమే కాదు, బీజేపీకి దాదాపుగా దానితో సమాన హోదాను కల్పించారు. అలా అని గత రెండేళ్లుగా కత్తులు దూసుకున్న ప్రత్యర్థు లిద్దరూ పౌర పరిపాలనాధికారాలను వాటాలు వేసు కుని పంచుకోవాలని కాదు. సంఖ్యా బలం రీత్యా బీజేపీ ప్రతిపక్షంగా ఉండి తప్పుడు పద్ధతులకు పాల్పడే అవకాశం ఉన్న పాలక పక్షానికి కళ్లెం వేయాలి.

ప్రత్యర్థితో చేతులు కలపడం కంటే మేయర్‌ పద విని కోరుకోకుండటమే బీజేపీకి గౌరవప్రదమైనది. ఆ రెండూ కలవడం అంటే నగర పాలక సంస్థలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయడమే. 227 మంది సభ్యు లున్న కార్పొరేషన్‌లో శివసేన, బీజేపీలు కలిస్తే 166 మంది కార్పొరేటర్ల భారీ ఆధిక్యత లభిస్తుంది. శివ సేన, బీజేపీలు కలసి పారదర్శక పాలనను అందించ లేవు. బీజేపీ ప్రతిపక్షంగా ఉంటే అందుకు హామీని కల్పించడానికి ప్రయత్నించవచ్చు, తన ఎన్నికల ప్రణా ళికకు కట్టుబడీ ఉండవచ్చు. అది నిజంగా కూడా గౌరవప్రదమైనది. కానీ రాజకీయాల్లో గౌరవం కోసం పాకులాడేది ఎవరు?

- మహేష్‌ విజాపృకర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ మెయిల్‌ : mvijapurkar@gmail.com

మరిన్ని వార్తలు