నిదుర లేని కల

26 Dec, 2016 00:20 IST|Sakshi
నిదుర లేని కల

కవిత

కలకు నిదురకు మధ్య
కలబోత లేని కలత ఒక్కటి
నేత్రాలవే
చూపులే వేరు
తల్లి కనులలో తడి కనులలో ఇసుక తుపాను
అనుకుంటాం కానీ
అక్కడెక్కడో అపుడెపుడో
తచ్చాడుతూ ఉంటాం కానీ
గతం ఎవరి ఆర్ట్‌ వారు వేసుకునే తెల్లని గోడ
చెలిమె ఇగిరిపోయిన చెలిమి యొక క్రీడామైదానం
సేఫ్‌ రిట్రీట్‌ తెలీనపుడు జ్ఞాపకమొక విష సంకేతం
మో అన్నట్టు
హృదయం ఒక మర్మాంగం
ఎవర్నని హలో అంటాం
అన్నట్టొరే
సూపర్‌లేటివ్స్‌ ఎప్పుడూ చిత్తభ్రమనే

( కవి కృష్ణమూర్తి )

మరిన్ని వార్తలు